15 June, 2026 | 10:39 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

డిజిటల్ దిశగా వేములవాడ రాజన్నాలయం

12-02-2026 12:00 AM

వాట్సాప్ చాట్‌బాట్‌తో సేవలకు శ్రీకారం

వేములవాడ, ఫిబ్రవరి 11,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం డిజిటల్ దిశగా మరో ముందడుగు వేసింది. ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన సమాచారాన్ని తక్షణం అందించేందుకు దేవస్థానం వాట్సాప్ చాట్బోట్ సేవలను ప్రారంభించింది.

దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ,కమిషనర్ సూచనల మేరకు ఆలయ ఈఓ రమాదేవి ఈ సేవలను బుధవారం అధికారికంగా ప్రారంభించారు. సర్వీసెస్ ఇన్ జస్ట్ ఎ ఫ్యూ క్లిక్ అనే నినాదంతో ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా భక్తులు ఆలయ సేవల వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం కలిగింది.భక్తులు పోస్టర్లో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా లేదా 8736936969 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా చాట్బోట్ సేవలను వినియోగించుకోవచ్చు. వెంటనే చాట్బోట్ స్పందించి అవసరమైన వివరాలను అందిస్తుంది.

ఈ సేవల ద్వారా దర్శనం, సేవల సమయాలు, దర్శన టికెట్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్, అన్నప్రసాదం, రవాణా సదుపాయాలు, ఆసుపత్రి, దివ్యాంగులకు సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్లు, కళ్యాణకట్ట, సమాచారం కేంద్రం, పోలీస్ స్టేషన్ తదితర అంశాలపై సమాచారం లభిస్తుంది. భక్తులు తమకు అవసరమైన సేవకు సంబంధించిన సంఖ్యను నమోదు చేసి సమాచారం పొందవచ్చు.భక్తులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ఈ డిజిటల్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని దేవస్థానం అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఇంచార్జి స్థానాచారి నమిలికొండ ఉమేష్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ శర్మ, ఈఈ రాజేష్, ఏఈవో బ్రహ్మన్న శ్రీనివాస్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మతో పాటు ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. సాంకేతిక భాగస్వామిగా ఆత్రేయ ఇన్ఫోటెక్ సంస్థ సేవలను అందించింది.