11 April, 2026 | 3:50 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

మంథనిలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

12-02-2026 12:00 AM
  1. స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్

మంథనిలో ఎన్నికలు పర్యవేక్షించిన n మంత్రి శ్రీధర్ బాబు

మంథని మున్సిపాలిటీ లో 76.76 శాతం ఓట్లు పోలింగ్ 

మంథని,ఫిబ్రవరి 11(విజయ క్రాంతి)పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ బుధవారం జరిగిన ఎన్నికల్లో 76.76 శాతం ఓట్లు పోలయ్యాయి.  పురుషుల ఓట్లు 5393 ఓట్లు పోలుకాగా మహిళలు 5663 ఓట్లు పోలయ్యాయి.   మొత్తం ఓట్లు 14.4 02 ఓట్లు ఉండగా మొత్తం 11056  ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు, 76.76 శాతం ఓట్లు పోలైనట్టు మున్సిపల్ కమిషనర్ మనోహర్ తెలిపారు.

ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా గంట వరకు మందకోడిగా సాగింది. 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఓటర్లు అధిక సంఖ్యలో రావడంతో కొన్ని పోలింగ్ బూతుల్లో ఓటర్లు బార్లు తీరారు. మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడం విశేషం. విజయం పై రాజకీయ పార్టీల్లో ఎవరికివారు ధీమాగా ఉన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్,  బీఆర్‌ఎస్ పార్టీలు పోటా పోటీగా ప్రచారం నిర్వహించాయి. 13 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారికి వచ్చే ఓట్ల ప్రభావం కొన్ని వార్డులో అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతోపాటు టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు లు మంతింలోనే మకాం వేసి ఎన్నికల ను ఇప్పటిక ప్పుడు పరివేక్షించారు. కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను అప్రమతం చేసి ఓటింగ్ సరలని పెంచే విధంగా వ్యూహం రచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.