calender_icon.png 12 February, 2026 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం

12-02-2026 12:00:00 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మున్సిపాలిటీలకు బుధవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పో లింగ్ ప్రక్రియను పరిశీలించారు. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సరళని పర్యవేక్షించారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్ నుండి ఎన్నికల తీరును పరిశీలిస్తూ అధికారులకు పలు సూ చనలు, ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ప్రక్రియ కోసం ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించారు.

- ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్

 రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఓటు హ క్కును వినియోగించుకున్నారు. ఈ లొకేషన్ లో ఉన్న పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఆమె వెంట మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు ఉన్నారు.

పోలింగ్ కేంద్రాలను తనిఖీ లో పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి

పెద్దపల్లి, ఫిబ్రవరి 11(విజయక్రాంతి) జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని పెద్దపల్లి డీసీపీ రాం రెడ్డి తెలిపారు. మంథని, రామగిరి, గోదావరిఖని-1 టౌన్, 2-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ  పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు డీసీపీ వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధులు, ఓటర్లకు కల్పించిన సౌకర్యాలపై డీసీపీ అధి కారులతో సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీసీపీ పిలుపునిచ్చారు.

ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.పోలింగ్, బ్యాలెట్ బాక్స్ స్ట్రాం గ్ రూమ్ చేరే వరకు ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలు కొనసాగుతాయని, శాంతియుత ఎన్నికల నిర్వహణే పోలీ స్ శాఖ ప్రధాన లక్ష్యమని డీసీపీ స్పష్టం చేశా రు.డీసీపీ  వెంట గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ ఐలు పాల్గొన్నారు.

జిల్లాలో మున్సిపల్ పోలింగ్ కేంద్రాల తనిఖీలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

రామగుండం ఫిబ్రవరి 11(విజయ క్రాంతి) జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు  ప్ర శాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో  రా మగుండం కార్పొరేషన్ పరిధిలో జ్యోతి నగర్ టిటిఎస్ జడ్.పి.హెచ్.ఎస్, పిటిఎస్ ఎన్టిపిసి ఎస్.టి క్లెయిర్స్, గౌతమ్ నగర్ లోని ప్రగతి పాఠశాల,  రాంనగర్ లోని హాట్ హై స్కూల్, అమరావతి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మధ్యాహ్నం మూడు గంటల వరకు లక్షా 01 వేయి 470 మంది (56.49) శాతం తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నరన్నారు.

ఉదయం 9 గంటల వరకు 9.5%, 11 గంటలకు 24.31%, 1 గంట వరకు 42.12% పోలింగ్ నమోదైందని, 5 గంటల వరకు పోలింగ్ కేం ద్రాలకు చేరుకోనున్న ఓటర్లకు టోకెన్ అం దించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని,పోలింగ్ అనంతరం బ్యా లెట్ బాక్స్ లను పటిష్ఠ భద్రతతో స్ట్రాంగ్ రూంకు తరలించే విధంగా ఏర్పాటు చేశామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెం ట రామగుండం తహసిల్దార్ ఈశ్వర్, సం బంధిత అధికారులు, పాల్గొన్నారు.

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం పోలింగ్ 77.70 శాతం నమోదు

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 11(విజయ క్రాంతి): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ 77.70 శాతం నమోదు అయిందని పేర్కొన్నారు.సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో39,942 మంది పురుషులు, 42,011మంది మహిళా ఓటర్లు, 06ఇతర ఓటర్లు ఉండగా, 30, 466 పురుషులు, 33,091 మహిళలు, ఇతరులు 05 మొత్తం 63,562 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 77.55 పోలింగ్ శాతం నమోదు అయింది.

అలాగే వేములవాడ మున్సిపల్ పరిధిలో 19,580మంది పురుషులు, 21,279మంది మహిళా ఓటర్లు, 18ఇతర ఓటర్లు ఉండగా, 14,801 పురుషులు, 17,070 మహిళలు, ఇతరులు 10 మంది మొత్తం 31,881 మంది ఓటు హక్కు వినియోగించు కున్నారు. పోలింగ్ శాతం 77.99 నమోదు అయింది. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో కలిపి 1,22,836 మంది ఓటర్లు ఉండగా, 95,443 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జిల్లా మొత్తం పోలింగ్ శాతం 77.70 నమోదు అయింది.సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసిన కుసుమ రామయ్య ఉన్నత పాఠశాల అలాగే సిరిసిల్ల గీతా నగర్ లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మున్సిపల్ పరిధిలోని ఇప్పలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. 

హెల్ప్ డెస్క్, మెడికల్ క్యాంప్ ను, ఓటింగ్ సరళిని సందర్శించి.. అధికారులతో మాట్లాడారు. అనంతరం వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో .. అలాగే 20 వ వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రంలో పరిశీలించారు. వేములవాడ లోని సినారె కళామందిరంలో రిసెప్షన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించారు.

అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం గాంధీ నగర్ లోని గ్రీన్ పోలింగ్ కేంద్రంలో పరిశీలించారు.పరిశీలనలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్ ,తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్, టీపీఓ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.