02-06-2025 07:48:32 AM
విధి నిర్వహణలో ఏ మచ్చ లేకుండా పదవి విరమణ అభినందనీయం..!
వైరా, విజయక్రాంతి: తాను చేసే పని పట్ల ఎంతో గొప్ప నిబద్దత అంకితభావంతో పనిచేసిన వ్యక్తి బొగ్గుల వెంకటరామిరెడ్డి అని పలువురు నేతలు అధికారులు అభినందించారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ(Telangana State Housing Corporation) అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ వర్క్ ఇన్స్పెక్టర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ బొగ్గుల వెంకటరామిరెడ్డి ఉద్యోగ పదవీ విరమణ సభ యూనియన్ ఆధ్వర్యంలో వైరాలోని కమ్మవారి కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ అభినందన సభకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, గృహ నిర్మాణ సంస్థ యూనియన్ రాష్ట్ర నాయకులు, ఉద్యోగులు, రాష్ట్ర మంత్రి పొంగిలేటి క్యాంప్ కార్యాలయా ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ 41 ఏళ్ల విధి నిర్వహణలో ఎటువంటి మచ్చ లేకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందటం ఎంతో అభినందనీయమన్నారు. గృహ నిర్మాణ శాఖ యూనియన్ కు, పేదలకు సేవలు అందించడం, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగులందరూ వెంకట్రామిరెడ్డి సమర్ధతను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన నాటినుండి నాకు సహకరించిన సహ ఉద్యోగులకు, ఉన్నత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సహకారంతోనే ఉద్యోగ బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహించానని, గౌరవం ఇస్తూ గౌరవం పొందుతూ ఉద్యోగ ప్రస్థానం సంతృప్తిగా పూర్తి చేశానన్నారు.
బొగ్గుల వెంకటరామిరెడ్డి పద్మావతి దంపతులను ఘనంగా శాలువాలతో సత్కరించారు నిండు నూరేళ్లు మీ దంపతులు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరారు.. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గువ్వా రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏలూరు వెంకటేశ్వర్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ వెంకట్ రెడ్డి కంది రవీందర్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ శేఖర్ రెడ్డి యూనియన్ నాయకులు కే వెంకన్న లింగయ్య గౌడ్ భాస్కర్ రెడ్డి ఏపీ యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ కుమార్ రోశయ్య పోతురాజు శ్రీను చౌదరి అలీ బొర్రా రాజశేఖర్ కట్ల రంగారావు శీలంవెంకట నర్సిరెడ్డి లైన్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ మురళీకృష్ణ లగడపాటి ప్రభాకర్, కట్ట కృష్ణార్జున రావు షేక్ లాల్ అహ్మద్ గృహ నిర్మాణ సంస్థ యూనియన్ నాయకులు ఉద్యోగులు ఉద్యోగులు పాల్గొన్నారు..