23 August, 2026 | 1:36 AM

వెంకటరామిరెడ్డి సేవలు స్ఫూర్తిదాయకం

23-08-2026 12:00 AM
  1. టీఎస్‌పీఎ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కేఆర్‌కే ప్రసాద్
  2. ఘనంగా 157వ రాజాబహదూర్ జయంతి వేడుకలు

రాజేంద్రనగర్, ఆగస్టు 22 (విజయక్రాంతి): పోలీసు వ్యవస్థకు వెంకటరామిరెడ్డి సేవలు స్ఫూర్తిదాయకమని, పేదలు, బలహీన వర్గాల కోసం ఆయన నిరంతరం చేసిన సేవలు చిరస్మరణీయమని రాజాబహద్దూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కేఆర్‌కే ప్రసాద్ అన్నారు. శనివారం వెంకట రామిరెడ్డి 157వ జయంతి వేడుకలను పోలీస్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. అకాడమీ అధికారులు, ఆర్బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్బీవీఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధ్యక్షుడు కొండా లక్ష్మీకాంతరెడ్డి మాట్లాడుతూ.. వెంకటరామిరెడ్డి విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. రిటైర్డ్ అదనపు ఎస్పీ తిరుపతిరెడ్డి ఆయన పోలీసింగ్ విధానం, ప్రజా సంక్షేమానికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రత్యేక అతిథులకు అకాడమీ తరఫున జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అధికారులు, డీఎస్పీలు, ఆర్‌ఐలు, సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.