3 July, 2026 | 2:24 AM

వెరీ గుడ్.. మీరు బాగా చదువుతున్నారు

03-07-2026 01:28 AM

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా 

నిర్మల్ జులై ( విజయ క్రాంతి)సోన్ మం డల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల కళాశాల ను గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9 గంటలకు పాఠశాలకు చేరుకున్న కలెక్టర్ హాజరు పట్టిక రికార్డులను పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి ఇంటర్ పదో తరగతి విద్యార్థులతో మా ట్లాడారు. తరగతి బోర్డుపై గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలను రాసి వాటికి సమాధానం చెప్పించుకున్నా రు.

కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు బాలికలు స మాధానం చెప్పడంతో వెరీ గుడ్ బాగా చదువుతున్నట్టు తెలుస్తుంది ఇలాగే చదవండి అంటూ ప్రోత్సహించారు. పుస్తకాల సబ్జెక్టు కాకుండా జనరల్ ప్రశ్నలను అడిగి సమాధా నం రాబట్టారు అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి అక్కడి వసతులపై ఎస్‌ఓ లతా దేవిని అడిగి తెలుసుకున్నారు. వంట గదులు పరిశీలించి నాణ్యమైన భోజనం అం దించాలని సిబ్బందికి సూచించారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.