మూడు నెలల్లో రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి
03-07-2026 01:26 AM
ఆదిలాబాద్, జూలై 2 (విజయక్రాంతి) : వంద శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జి పనులు 70 నుంచి 80 శాతం వరకు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం సంజయ్ నగర్ వద్ద కొనసాగుతున్న ఆర్.ఓ.బీ పనులను ఎమ్మెల్యే పరిశీలిం చారు.
పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని అధికారులు, ఇంజనీర్లకు సూచించారు. అనంతరం ఆర్.ఓ.బీ పనుల గురించి ఇంజనీర్ ఎమ్మెల్యేకు వివరించగా మ్యాప్ ను పరిశీలించి త్వరతగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే వెంట కౌన్సిలర్లు గంట జీవన్, బొడిగం శ్రీకాంత్, ఆత్రం సాయికృష్ణ, విలాస్, బీజేపీ నాయకులు జోగు రవి, ఆర్.అండ్.బి ఈఈ నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.






