20-01-2026 05:03:10 PM
కృషి విజ్ఞాన కేంద్రం కోర్డినేటర్ గోపాల్ వర్మ
తలమడుగు,(విజయక్రాంతి): కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో టిడిసి-నిక్రా కార్యక్రమం కింద తలమడుగు మండల పశు సంవర్థక శాఖ సహకారంతో మండలం లోని లచ్చంపూర్ లో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు అవసరమైన మందులు, టీకాలు, ఖనిజ లవణాల మిశ్రమం, మినరల్ లిక్ బ్రిక్స్‌ను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా కృషి విజ్ఞాన కేంద్రం కోర్డినేటర్ డాక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.... పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. పశువుల ఆరోగ్య సంరక్షణ ద్వారా రైతుల ఆదాయం పెంపొందించడంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగు, శాస్త్రవేత్తలు డా. రఘువీర్, డా. శివచరణ్, డా. సురేష్, డా. రాకేష్, మండల పశు వైద్యాధికారిణి లావణ్య, ఎల్ఎస్ఎ సాయి ప్రసాద్, పశు వైద్య సిబ్బంది సౌమ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.