20-01-2026 05:08:42 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండలంలోని పిడిలు, పిఈటిలుతో మండల విద్యాధికారి విజయ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం కప్ 2025 క్రీడలను ఉద్దేశించి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మండల స్థాయిలో 29 , 30 తేదీలలో అభ్యుదయ పాఠశాల దోమకొండ నందు ఈ క్రీడలు నిర్వహించబడుననీ దోమకొండ మండల ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, అధికారులు తెలియజేశారు.