calender_icon.png 20 January, 2026 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొబైల్ ఫోన్ అప్పగింత

20-01-2026 04:58:27 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రోజున ఇద్దరు యువకులకు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వారికి అప్పగించి మాధారంఎస్సై సౌజన్య తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మాదారం3 ఇంక్ లైన్ గ్రామానికి చెందిన చిలువేరి సాయికిరణ్ (సామ్సంగ్ మొబైల్) రేపల్లెవాడ గ్రామానికి చెందిన ఉరడి సాయికుమార్ (రియల్ మీ మొబైల్) ఫోన్లను ఇటీవల పోగొట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో C.E.I.R పోర్టల్ కు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు  వెతికి వారికి మొబైల్ ఫోన్ లను అప్పజెప్పగించారు. ప్రతి ఒక్కరు తమ మొబైల్ ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని,  అనుకోకుండా ఎప్పుడైనా మొబైల్ ఎక్కడైనా పడిపోతే వారు ఆన్లైన్ లో C.E.I.R పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసు శాఖ  పూర్తిస్థాయిలో విచారించి తిరిగి బాధితులకు అందజేస్తామని ఎస్సై సౌజన్య తెలిపారు. పోగొట్టుకున్న సెల్ఫోన్లను తమకు అప్పగించినందుకు సదరు యువకులు ఎస్సై సౌజన్యకు కృతజ్ఞతలు చెప్పారు.