2 April, 2026 | 3:47 PM

Breaking News

కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న రేవంత్ — ఇప్పటివరకు ఏం చేశారు?   •   కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సాకారం..   •   పిల్ల కాంగ్రెస్.. పిల్ల చేష్టలతో మూడుముక్కలాట ఆడింది   •   మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ   •   భారీ శోభాయాత్ర: Hyderabadలో 13KM Hanuman Yatra—ఎక్కడ నుంచి ఎక్కడ వరకు? ట్రాఫిక్ ఎలా?   •   గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలి   •   మంథనిలో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు   •   దొంగనోట్ల ముఠా గుట్టురట్టు - ముగ్గురు అరెస్ట్   •   అంజన్నకు మొక్కలు తీర్చుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఇంట్లోనే పిల్లల మృతదేహాల ఖననం   •  

వీహెచ్ జన్మదిన వేడుకలు

17-06-2025 01:13 AM
  1. సీఎం రేవంత్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ శుభాకాంక్షలు
  2. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, నేతల ఆధ్వర్యంలో కేక్ కటింగ్

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు (వీహెచ్) జన్మదిన వేడుకలు సోమ వారం ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వీహెచ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. అనంతరం వీహెచ్ అంబర్‌పేటలోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వీహెచ్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. వీహెచ్ తర్వాత  పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి విశ్వనాథం మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం వారంతా విద్యార్థులు, జీహెచ్‌ఎంసీ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా  పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ..

కాంగ్రెస్ పార్టీలో బలమైన బీసీ నేతగా వీహెచ్‌కు పేరున్నదని, పేదల ప్రజల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం శ్రమించే తత్వం ఉన్న నేత అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం వీహెచ్ ప్రాణాలు పెడతారని శ్లాఘించారు. వీహెచ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు,

సంభాని చంద్రశేఖర్,  ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, కోదండరాం, అమీర్ అలీఖాన్,  రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, ఎంపీలు మల్లు రవి, అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు ఉన్నారు.