1 August, 2026 | 12:29 PM

సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ కన్నుమూత

03-09-2025 12:23 AM

భౌతికయానికి నివాళులు అర్పించిన సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కర్రే ప్రకాష్ (50) గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు  హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, భౌతిక యానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీనియర్ జర్నలిస్టు కర్రే ప్రకాష్ మృతి పట్ల జర్నలిస్టులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం లొ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, అయిత పరంజ్యోతి, రజనకు ప్రవీణ్ కుమార్, తాడేపు వెంగళరావు, స్టాలిన్ నర్సింలు, భాస్కర్, రాజా గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పాల్గొన్నారు