26 March, 2026 | 2:48 AM

కొనసాగుతున్న మహిళా సదస్సు

26-03-2026 12:00 AM

ఓయూలో పాల్గొన్న వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం

ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ సురేపల్లి నంద

సికింద్రాబాద్, మార్చ్25(విజయక్రాంతి): ఓయూలో నిర్వహిస్తున్న అంతర్జా తీయ మహిళా సదస్సు బుధవారం ఘనం గా కొనసాగింది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం అధ్యక్షతన రెండో రోజు జరిగిన ఈ సదస్సులో  మహిళా సాధికారతపై పలువురు మాట్లాడారు. సదస్సుకు ముఖ్య అతిథి గా జస్టిస్ సురేపల్లి నంద హాజరై మాట్లాడారు. భారతదేశంలో మహిళా హక్కులు, చట్టపరమైన సాధికారత‘ అనే అంశంపై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుం డి భారతీయ న్యాయ వ్యవస్థ గమనాన్ని సమగ్రంగా వివరించారు.

సమానత్వపు హక్కు, జీవించే హక్కు,ఆరోగ్య హక్కు,  ప్రత్యుత్పత్తి హక్కుల  పరిరక్షణలో న్యాయవ్యవస్థ పోషిస్తున్న క్రియాశీల పాత్రను ఆమె గుర్తుచేశారు. న్యాయవ్యవస్థ జోక్యం కీలకమైనప్పటికీ, సమసమాజ స్థాపన అనేది కేవలం బలమైన చట్టబద్ధమైన విధానాల ద్వారానే సాధ్యమవుతుందని  అభిపప్రాయం వ్యక్తం చేశారు.మహిళల వ్యక్తిగత నిర్ణయాధికారాన్ని రక్షించాలన్నారు. అన్ని స్థాయిలలో సమాన విద్యా అవకాశాలను నిర్ధారించాలన్నారు.

మహిళల ఎంపికలను, హక్కులను కాపాడే బలమైన చట్టాలను రూపొందించాలన్నారు. సామాజిక అంచనాల ‘మ్యాట్రిక్స్‘ను మా ర్చాలని, పాతుకుపోయిన లింగ వివక్షను తొలగించాలన్నారు.  మహిళల వృత్తిపరమైన ఎదుగుదలను అడ్డుకుంటున్న అదృశ్య అడ్డంకులను ఛేదించడానికి నిరంతరం కృషి చేయాలని ఆమె కోరారు. మరింత సమానత్వంతో కూడిన, చట్టపరమైన అవగాహన ఉన్న సమాజాన్ని పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం.విజ్జులత,  తదితరులు పాల్గొన్నారు.