11 May, 2026 | 4:15 AM

తెలంగాణలో విజయమే లక్ష్యం: ఎంపీ డీకే అరుణ

11-05-2026 02:36 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిందని, ము ఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో నరేంద్ర మోదీ పై విశ్వాసంతో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చారని, తర్వాతి లక్ష్యం తెలంగాణలో విజయమేనని పాలమూరు ఎంపీ డీకే అరు ణ స్పష్టం చేశారు. వికసిత్ భారత్ మోదీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని వెల్లడించారు. వికసిత్ భారత్‌లో ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని తెలంగాణలో పది వేల కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు హామీలతో అన్ని వర్గాలను ప్రజలను మో సం చేశాయని మండిపడ్డారు. ప్రజల కల సాకారం కావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.