18 August, 2026 | 1:44 AM

చివర్లో చేజారిన విజయం

18-08-2026 12:00 AM
  1. ఇంగ్లాండ్ చేతిలో ఓడిన భారత్
  2. పురుషుల హాకీ ప్రపంచకప్

ఆమ్‌స్టల్‌వీన్, ఆగస్టు 17 : పురుషుల హాకీ ప్రపంచ కప్-లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. సోమవారం ఆమ్ స్టల్‌వీన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన పూల్- డి గేమ్‌లో 2 తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఎప్పటిలానే చివర్లో గోల్స్ సమర్పించుకునే బలహీనత ఈ మ్యాచ్‌లో భారత్ కొంపముంచింది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగంలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. నిక్ బందురాక్ గోల్‌తో ఇంగ్లండ్ బోణీ కొట్టినప్పటికీ తర్వాత భారత్ అద్భుతంగా పుంజుకుంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడం, తర్వాత దిల్ ప్రతీ సింగ్ ఫీల్డ్ గోల్ చేయడంతో భారత్ 2 ఆధిక్యంలో నిలిచింది. కానీ రెండో అర్థభాగంలో సీన్ రివర్సయింది.   

రెండో అర్ధభాగంలో ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా గోల్స్ సమర్పించుకుం ది. ఇంగ్లాండ్ ఆటగాడు నికోలస్ బందురాక్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు స్టువర్ట్ రష్మేర్, హెన్రీ క్రాఫ్ట్ ద్వితీయార్థంలో అటాకింగ్ పెంచి భారత్ డిఫెన్స్‌ను ఛేదించారు. స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భారత జట్టు పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితం కావడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది.