18 August, 2026 | 1:18 AM

ఏషియన్ మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌కు షేక్ సాజీదా

18-08-2026 12:00 AM

హైదరాబాద్, ఆగస్టు 17 : 11వ తెలంగాణ మాస్టర్స్ అంతర జిల్లా స్విమ్మింగ్ ఛాం పియన్‌షిప్‌లో మేడ్చల్ మల్కాజగిరి జిల్లాకు చెందిన షేక్ సాజిదా అద్భుత ప్రదర్శన కనబరిచారు. 35 వయసు విభాగంలో పోటీ పడిన ఆమె ఒక స్వర్ణం, ఒక రజతం సాధించారు.

మహిళల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో షేక్ సాజీదా బంగా రు పతకం గెలుచుకున్నారు. ఈ రేసును ఆమె 1 నిమిషం 4.19 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచారు. అలాగే మహిళల 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో షేక్ సాజీదా 1 నిమిషం 12.6 సెకన్లలో రేసు పూర్తి చేసి రెండో స్థానంలో నిలవడం ద్వారా రజతం సాధించారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన స్విమ్మర్లకు ఏషియన్ మాస్టర్స్ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడేందుకు అర్గత లభించింది. బెంగళూరు వేదికగా అక్టోబర్ 4 నుంచి 10 వరకూ ఏషియన్ మాస్టర్స్ స్వి మ్మింగ్ ఛాంపియన్‌షిప్ జరగనుంది.