01-12-2024 01:43:21 AM
7-8 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రముఖ సబ్బుల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచేశా య్. సబ్బుల తయారీలో ఉపయోగించే పామాయిల్ ఈ ఏడాది 30శాతంపైగా పెరిగినందువల్ల తమ ఉత్పత్తుల ధరలను 7-8శాతం పెంచినట్టు ప్రకటించాయి. ధరలు పెంచిన కంపెనీల్లో హిందూస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), విప్రోసహా అన్ని ప్రధాన సంస్థలూ ఉన్నా యి.
మార్కెట్ ఒడుదొడుకులకు అనుగుణంగానే తాము ధరల్లో సర్దుబాటు చేస్తుంటామని విప్రో కన్జూమర్ కేర్ ప్రతినిధి నీరజ్ ఖత్రి పేర్కొన్నారు. హెచ్‌యూఎల్ లక్స్ ధరరను(5 సబ్బు ల ప్యాక్) రూ.145 నుంచి రూ.155కు పెంచింది. లైఫ్‌బాయ్ ధర కూడా ఇదే తరహాలో రూ.155 నుంచి రూ.165 కు, పియర్స్ ధర (4 సబ్బుల ప్యాక్) రూ.149 నుంచి 169కు పెరిగాయి.
వీటితోపాటు ఆయా సంస్థలకు చెంది న స్కిన్ క్లీనింగ్ క్రీమ్ ధరలు కూడా పెరిగాయి. ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్పత్తి తగ్గిందనే కారణంతో టీ పొడి ధరలను పెంచినట్టు టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్, హెచ్‌యూఎల్ ప్రకటించాయి.