17 April, 2026 | 11:10 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విద్యుత్ శాఖకు విజిలెన్స్ ఫీవర్..!

11-06-2025 12:07 AM

 -అవినీతి అక్రమాలు తేల్చేందుకు విజిలెన్స్ విచారణ చేయిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ 

- పనులు చేయకుండానే బిల్లులు స్వాహా చేస్తున్న వైనం 

- నాకు ఎలాంటి సమాచారం లేదు : వెంకట రమేష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, మహబూబ్‌నగర్ 

మహబూబ్ నగర్ జూన్ 10 (విజయ క్రాంతి) : విద్యుత్ శాఖకు విజిలెన్స్ ఫీవర్ పట్టుకుంది. గత సంవత్సరాలుగా వివిధ వి భాగాలలో పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు పొందుకుంటున్నాయి. ఇప్పటికే ఈ తరుణంలోనే గతంలో గతంలో విధులు నిర్వ హించిన విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎస్సీ ప్రభాకర్ రావు ఓ కాంట్రాక్టర్ చేసిన పనులను తనిఖీ చేశారు.

సదరు కాంట్రాక్టర్ పనులు నిర్లక్ష్యంగా చేయడంతో పాటు రైతుల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేసినట్లు సంబంధిత అధికారి దృష్టికి రావడంతో ఆ కాంట్రాక్టర్ లైసెన్సును నిలిపివేయడం జరిగింది. ఈ క్రమంలోనే నూతన ఎస్‌ఈ గా బాధ్యతలు చేపట్టిన వెంకట రమేష్ విచ్చేసిన అనంతరం తిరిగి ఆ లైసెన్స్ను పునరుద్ధరించడం జరిగింది. నియమ నిబంధనలు అమ లు చేయకుండా కేవలం కాగితాలకే పరిమితమవుతూ పనులు జరగడంలేదని సమాచా రం రాష్ట్ర ఉన్నత అధికారులకు చేరడంతో జి ల్లాలో పలు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు గత మూడు రోజుల నుంచి విచారణ చేస్తున్నారని పేరు చెప్పని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. 

భూత్పూర్ మండలంలో విచారణ..

జిల్లాలోని భూత్పూర్ మండలంలో విజిలెన్స్ విచారణ వేగవంతంగా కొనసాగుతుం ది. గోపులాపూర్ గ్రామంలో రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేసినట్లు తెలుస్తుంది. ఈమెకు విజిలెన్స్ అధికారులకు సంబంధిత రైతులు పూర్తిస్థాయిలో నిజాలను తెలియజేసినట్లు పలువు రు పేర్కొంటున్నారు. అసలే విద్యుత్ చాలా విలువైనది. ఆపై కొందరు విద్యుత్ అధికారు లు వారికి ఇష్టనుసారంగా వివరిస్తూ రైతులను, విద్యుత్ వినియోగదారులను నిండా ముంచుతుండ్రు. చేసేదేమీ లేదు వినియోగదారులు సైతం వారు చెప్పినట్లు తల ఊపు తున్నారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణతోనే ఈ సమస్యలకు ముగింపు పడే అవకాశం ఉంది. 

- అధికారులు అనుకుంటే చాలు..?

విద్యుత్ శాఖ అధికారులు అనుకుంటే చాలు అనుమతులు లేకుండానే చకచకా పనులు జరుగుతాయి. పలు ప్రాంతాల్లో లైన్ షిఫ్టింగ్ సైతం బాధ్యత అధికారులు సహకారం అందిస్తూ ఇష్టం సారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు బలంగా ఉన్నా యి. కొన్నిచోట్ల ప్రైవేట్ పనులు చేయిస్తూ వాటిని కూడా టీఎన్డి కింద చూపిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా విద్యుత్ శాఖ అధికారులు వారి ఇష్టం సా రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రోజురోజుకు అధికంగా ఉత్పన్నమవుతున్నా యి. ఉన్నత అధికారులు జిల్లా వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ప్రతి పనిలోనూ విజిలెన్స్ ఎంక్వయిరీ చేపడితే మరింత పారదర్శకంగా విద్యుత్ శాఖ పనులు జరిగే అవకాశం ఉం టుందని రైతులు పేర్కొంటున్నారు. 

- నాకు ఎలాంటి సమాచారం లేదు..

విజిలెన్స్ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నట్లు నాకు ఎలాంటి సమాచారం లేదు. పనులు చేయకుండానే బిల్లులు ఆమోదం తెలపడం అనే విషయం కూడా నాకు తెలియదు. నియమ నిబంధనలను ప్రకారం బిల్లులు చేయడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడ విజిలెన్స్ ఎంక్వయిరీ జరుగుతుందో కూడా తెలియదు. సమాచారం వచ్చిన వెంటనే చెబుతాను. 

              వెంకట రమేష్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, మహబూబ్‌నగర్