17 April, 2026 | 11:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జీహెచ్‌ఎంసీ సర్కిళ్లలో సిబ్బంది కొరత?

11-06-2025 12:08 AM
  1. అధికారులు లేక కొరవడిన పర్యవేక్షణ 
  2. అడ్డూ అదుపు లేకుండా నిర్మాణాలు
  3. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులపైభారం 

ఎల్బీనగర్ , జూన్ 10 : జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎల్బీనగర్ జోనల్ సర్కిల్ కార్యాల యాల్లో అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. సర్కిళ్ల టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరతతో అధికంగా ఉండడంతో పూ ర్తి స్థాయిలో పని చేయలేని స్థితిలో ఉన్నారు. ఫలితంగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలు యధేచ్చగా కొనసాగుతున్నాయి.

అక్రమ నిర్మాణా లను అడ్డుకోవాల్సిన అధికారులే చూసి చూ డనట్లుగా ఉన్నారు. అక్రమ నిర్మాణాలకు నో టీసులు ఇవ్వాలన్నా... కొత్త నిర్మాణాల దరఖాస్తులకు ఫీల్ విజిట్ చేయాలన్నా... అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నా.... నెలల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. దీంతో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల మాదిరిగా వెలుస్తున్నాయి.ఒకదానికి నిర్మాణ అనుమతులు తీసుకుని మరో రకమైన నిర్మా ణాలు చేపడుతున్నారు.

వీటిపై చర్యలు తీసుకునేవారే లేరు. హయత్ నగర్, ఎల్బీనగర్, సరూర్ నగర్ మూడు సర్కిళ్లలో  టౌన్ ప్లానింగ్ విభాగం లో ఏసీపీ, టీపీఎస్ స్థాయి నుంచి నాక్ ఇం జినీర్లు, చైన్ మెన్ల వరకు సిబ్బంది కొరత ఉన్నది. ముగ్గురు అసిస్టెంట్ సిటీ ప్లానర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారు. సర్కిల్ కు ఇద్దరు ఉండాల్సిన టీపీఎస్ లు మొత్తానికి ఒక్కరే ఉన్నారు. ఇటీవల ముగ్గురు నాక్ ఇంజినీర్లను తొలిగించారు.

వారి స్థానాల్లో కొత్తవా రు రాలేదు. సర్కిల్ కు ఒక ఏసీపీ, ఇద్దరు టీ పీఎస్, ఒక న్యాక్ ఇంజినీర్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్లు విధులు నిర్వ హిస్తున్నారు. వీరితోపా టు డిమాలిటేషన్ టీమ్, డిమాలిషన్ వాహనాలు, కూల్చివేతల కోసం ప్రత్యేకంగా కార్మికులు ఉండాలి. కానీ, మూడు సర్కిళ్ల లో అధికారులు, సిబ్బంది కొరత ఉన్నది.

అక్రమ నిర్మాణాలపై పర్యవేక్షణ కరువు

సర్కిల్ పరిధిలో అన్ని విభాగాల కంటే టౌన్ ప్లానింగ్ విభాగం ప్రత్యేక పాత్ర పోషిస్తు ఉంటుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడమే కాకుండా ఇతర కీలక పనులు చేయాల్సి ఉంటుంది. వర్షాకాలంలో నాలా విస్తరణ, నాలా ఆక్రమణలు, శిథిలావస్థకు చేరుకున్న భవనాలపై నివేదిక రూపకల్పన, సర్వే, నోటీసులు ఇచ్చే పనులు ఉంటాయి.  ముఖ్యంగా అక్రమ నిర్మాణాల నియంత్రణ పనులన్నీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బందిపై ఉంటుంది. ఇతర పనులు వీరికి అదనపు భారంగా మారాయి. 

ఫలితంగా ఎల్బీనగర్ జోనల్ పరిధిలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించి, అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే, ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలపై కూడా చర్యలు తీసుకుంటామని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌పేర్కొన్నారు.