సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో విజిలెన్స్ తనిఖీలు
17-04-2026 12:00 AM
డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు
వరంగల్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భూముల క్రయ, విక్రయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం స్టాంపు డ్యూటీ ఫీజులు కట్టించడం లేదనే సమాచారం మేరకు, విజిలెన్స్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాలతో వరంగల్ రేంజ్ విజిలెన్స్ డీఎస్పీ మల్లయ్య, తహసీల్దార్ లక్ష్మణ్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేప ట్టారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారుల నుంచి డ్యాకుమెంట్లు స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి చెల్లించే పన్నులు చెల్లింపులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విచారణ నివేదికను ప్రభు త్వానికి అందజేయనున్నట్లు చెప్పారు.






