28 July, 2026 | 1:46 AM

సూర్యాపేట జిల్లాలో విజిలెన్స్ దాడులు

28-07-2026 12:44 AM
  1. పలు -రైస్ మిల్లుల్లో ధాన్యం లోటు 
  2. 38.9 కోట్లుగా గుర్తింపు
  3. మిల్లు యాజమాన్యాలపై కేసులు 

సూర్యాపేట, జూలై 27 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని పలు రైస్ మిల్లులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులు సోమవారం సం యుక్తంగా తనిఖీలు నిర్వహించి భారీ అక్రమాలను వెలికితీశారు. పెన్‌పహాడ్ మండ లం మాచారంలోని జేపీ రైస్ మిల్లులో గత ఆరు నెలలుగా సీఎంఆర్ బియ్యం అప్పగించకపోవడంతో పాటు తనిఖీల్లో రూ.11.67 కోట్ల విలువైన 4,886.50 టన్నుల ధాన్యం లోటు ఉన్నట్లు గుర్తించారు.

కాసరాబాద్‌లోని ఎస్వీఆర్‌ఐ రైస్ మిల్లులో తనిఖీలు చేప ట్టగా రూ.27.23 కోట్ల విలువ గల 11,400. 843 టన్నుల ధాన్యం వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన ఈ రెం డు మిల్లుల యాజమాన్యాలపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఎఫ్‌ఐఆర్ నమోదుకు సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్‌కు అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్లు ప్రదీప్‌రెడ్డి, రాజశేఖర్, విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.