15 June, 2026 | 2:47 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

బాన్సువాడ సబ్ రిజిస్టర్ పై విజి 'లెన్స్' దాడులు...

29-11-2025 08:07 PM

అందుబాటులో లేని సిబ్బంది...

షట్టర్లు మూసుకున్న రైటర్లు...

కార్యాలయ పనితీరుపై ఆరా...

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణల మేరకు విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు రైటర్లు సాహసిస్తున్నారన్న అఅక్క సమాచారం పక్కా సమాచారం మేరకు బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. విజిలెన్స్ అధికారులు వస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న రైటర్లు వారి షటర్లను మూసుకొని అందుబాటులో లేకుండా పోయినట్లు సమాచారం.

అదేవిధంగా కార్యాలయ అధికారితో పాటు సిబ్బంది సైతం కార్యాలయంలో అందుబాటులో లేరని తెలిసింది. బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రైటర్ లదే పెత్తనం కొనసాగుతున్నడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. రిజిస్ట్రేషన్లలో పైకం అందిస్తే ఏ పనైనా చేసి పెట్టేందుకు సిద్ధహస్తులవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణాల పనులు ఉన్నప్పటికీ ఖాళీ స్థలం చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు కూడా లేకపోలేదు అన్న వదంతులు వెలువెత్తుతున్నాయి.

బాన్సువాడ పట్టణంలో ప్రధాన రహదారికి పక్కన ఉన్న షట్టర్ల నిర్మాణాలు ఉన్నప్పటికీ ఖాళీ స్థలం చూపిస్తూ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ విజిలెన్స్ అధికారులు రిజిస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై నిగా పెట్టడంతో పాటు నిజాంబాద్ రిజిస్టార్ కార్యాలయంలో సోదాలు జరిపిన విషయం విధితమే. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

దీని దరిమిల శనివారం బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించేందుకు విజిలెన్స్ అధికారులు వచ్చినట్లు తెలిసింది. వారు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న సబ్ రిజిస్టర్ రైటర్లు ముందుగానే జాగ్రత్త పడ్డారని సమాచారం. వారితోపాటు కార్యాలయాల సిబ్బంది కూడా అందుబాటులో ఉండకపోవడం వల్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ఏదేమైనా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు, వెంచర్ల విషయంలో జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ ల ప్రక్రియపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.