12 May, 2026 | 1:21 AM

స్టాలిన్‌తో విజయ్ భేటీ

12-05-2026 12:13 AM

డీఎంకే అధినేత ఇంటికెళ్లిన సీఎం 

చెన్నై, మే 11: తమిళనాడు నూతన ము ఖ్యమంత్రి విజయ్ సోమవారం మాజీ ము ఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ నెల 13న అ సెంబ్లీలో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించు కుంది. చెన్నైలోని అల్వార్‌పేటలో ఉన్న స్టాలిన్ నివాసానికి నూతన సీఎం విజయ్ సోమవారం ఉదయం వెళ్లారు.

దీంతో మాజీ సీఎం స్టాలిన్ తన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి విజయ్‌కి ఘనస్వాగతం పలికారు. ఉదయనిధి, స్టాలిన్ కొత్త సీఎం విజయ్‌ని ఆలింగ నం చేసుకుని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నేతలు ఒకరికొకరు పట్టు వస్త్రాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించుకున్నారు. ఈ భేటీని కేవలం మర్యాదపూర్వ కమైనదిగా డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ నూ తన సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్ మ ధ్య సాగిన ఈ భేటీ రాజకీయ మర్యాదకు నిదర్శనంగా నిలిచింది.

అనంతరం డీఎంకే అధినేత ఎక్స్‌లో మాట్లాడుతూ, తాను సమావేశంలో విజయ్‌ని అభినందించానని, కొత్త గా నియమితులైన సీఎంకు కొన్ని సలహాలు కూడా ఇచ్చానని చెప్పారు. ‘తమిళనాడు సీ ఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ నన్ను రాజకీయ మర్యాదతో కలిసి నా శుభాకాంక్షలు స్వీకరించారు.

నేను ఆయనకు నా హృదయపూర్వక అభినందనలతో పాటు నా సలహాను కూడా అందించా’ అని స్టాలిన్ పేర్కొన్నారు. అంతకు ముందు ఉదయమే విజయ్ శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ బాధ్యతలు చేపట్టారు. మంత్రి ఎస్ కీర్తన మాత్రం ఎలక్షన్ సర్టిఫికెట్‌ను వెంట తీసుకురాలేకపోవడంతో ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.