12 May, 2026 | 8:49 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

అన్నాడీఎంకే ఉచితాల మ్యానిఫెస్టో విడుదల

25-03-2026 12:00 AM
  1. ఏడాదికి మూడు సిలిండర్లు, ఫ్రిజ్, విద్యారుణాలు మాఫీ

పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం

మహిళా ఉద్యోగులకు టూవీలర్ కొనుగోళ్లలో రాయితీ

చెన్నై, మార్చి 24: రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఉచితంగా ఫ్రిజ్, ఏడాదికి మూ డు గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని ఏఐడీఎంకే ప్రకటించింది. మంగళవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎడప్పాడి పళనిస్వామి ప్రముఖులతో కలిసి మ్యానిఫెస్ట్టో విడుదల చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణాలను మాఫీ చేస్తామని, ప్రతి కు టుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం, రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతోపాటు, కిలో పప్పు, కిలో మంచినూనె అందజేస్తామని, జల్లికట్టు యోధుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం,

సామాజిక భద్రతా పింఛను రూ.2వేలకు పెంచుతామని అందులో ప్రకటించారు. మహిళల మాదిరిగానే పురుషులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకొస్తామని, రూ. 25వేల రాయితీతో 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామని ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం లో ఏఐడీఎంకే విడుదల చేసిన మ్యానిఫెస్ట్టోతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కినట్లయ్యింది.