02-12-2025 11:45:06 AM
పాఠశాలలోనే స్కూటీ కి ఛార్జింగ్ పెడుతూ విజయక్రాంతికి దొరికిన దృశ్యం..
మునిపల్లి,(విజయక్రాంతి): ఆయనొక ప్రభుత్వ పాఠశాలలో గవర్నమెంట్ టీచర్(Government Teacher).. ఆయనకేం అంతా మంచిగున్నడు.. అనుకోని వాళ్ళు చాలామంది ఉంటారు.. కానీ ఓ టీచర్ మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే సాలరీతోపాటు ఇంట్లో చార్జింగ్ పెడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనుకున్నాడేమో.. ఆ టీచర్.. అందుకే తాను బోధించే పాఠశాలలోని చార్జింగ్ పెడుతున్న దృశ్యం మంగళవారం ఉదయం.. విజయక్రాంతి కెమెరాకు చిక్కింది. ఆ పాఠశాల ఎక్కడో లేదు.. మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే ఉంది ఆ పాఠశాల ఖమ్మంపల్లి పాఠశాలనే(Khammampally School). ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో హిందీ పండిట్ గా పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తున్నాడు.
అయితే జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి ప్రతి రోజు పాఠశాలకు విద్యార్థులకు బోధన నిమిత్తం వస్తున్నాడు. కానీ ఉదయం రాగానే పాఠాలు బోధించడం ఏమో కానీ కిటికీ పక్కన ఉన్న స్విచ్ బోర్డుకు తన స్కూటీకి చార్జింగ్ పెట్టి చార్జింగ్ పెడుతున్నాడు. ఇదేంటి ఈ సారుకు ఇంటికాడ చార్జింగ్ పెట్టడం లేదా.. చార్జింగ్ పెడితే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనుకుంటున్నాడెమో మరి.. పాఠశాలకు వచ్చినప్పుడల్లా చార్జింగ్ పెట్టుకుంటున్నాడు.. అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పాఠశాలకు సంబంధించిన కరెంట్ బిల్లు మోతముగుతున్నదని , ఈ విషయంపై గ్రామపంచాయతీ, విద్యా శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలకు బోధించే ఉపాధ్యాయులు ఇలా చార్జింగ్ పెట్టకుండా చూసి .. పాఠశాలకు సంబంధించిన కరెంట్ బిల్లు తగ్గేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.