calender_icon.png 2 December, 2025 | 11:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వారకుంట గ్రామంలో టీడీపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ

02-12-2025 11:17:08 AM

టీడీపీలో 50 కుటుంబాలు చేరిక వార్తను ఖండించిన బీఆర్ఎస్ నాయకులు..

కోదాడ: కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో(Dorakunta village) టీడీపీ, బీఆర్ఎస్ కలిసి ఎన్నికల బరిలో ఉన్నట్లు పిఎసిఎస్ మాజీ చైర్మన్ ముత్తవరపు రమేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. టీడీపీలో 50 కుటుంబాలు చేరిక అని వచ్చిన పలు పత్రికల్లో వార్తను ఖండించారు. టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలు గ్రామపంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయుటకు ఇరు వర్గాలు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా చౌడం వెంకట్రామయ్య బీఆర్ఎస్ నుండి టీడీపీ కండువా కప్పుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా 7 వార్డులలో బీఆర్ఎస్ వారు, ఐదు వార్డులలో టీడీపీ వారు పోటీ చేయుట, ఉప సర్పంచ్, ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే విధంగా టీడీపీ నాయకుల సమక్షంలో మాట్లాడినట్లు తెలిపారు. ఏ ఒక్క కుటుంబం కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి టీడీపీ పార్టీలో చేరలేదు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.