17 April, 2026 | 6:06 PM

ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష

26-05-2025 01:43 AM

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్  సంగువాన్

 కామారెడ్డి, మే 25( విజయక్రాంతి ) కామారెడ్డి జిల్లాలో గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో గ్రామ పాలన అధికారుల స్క్రీనింగ్ టెస్ట్ ను నిర్వహించారు.

ఈ పరీక్ష  కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగువాన్ పరిశీలించారు. ఈ పరీక్ష కేంద్రంలో 401 మంది అభ్యర్థులకు గాను 377 మంది హాజరయ్యారని, 24 మంది ఆబ్సెంట్ అయ్యారని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి మసూద్ అహ్మద్ పాల్గొన్నారు.