పల్లె దవాఖానాలు వెంటనే ప్రారంభించాలి
28-03-2026 03:15 PM
మాజీ ఏఎంసీ చైర్మెన్ పత్తిపాక వెంకటేష్
ధర్మపురి,(విజయక్రాంతి): ఉమ్మడి వెల్గటూర్ మండలంలో పూర్తిఅయిన పల్లె దవాఖానాలను వెంటనే ప్రారభించాలనీ వెల్గటూర్ మండల మాజీ మార్కెట్ కమీటీ చైర్మెన్ పత్తిపాక వెంకటేష్ పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మంజూరి చేసిన పల్లె దవాఖానాలూ నిర్మాణం పూర్తయినప్పయికీ నేటికీ ప్రారభించకపోవడ దురదృష్టం అన్నారు. సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ చూపి పల్లె దవాఖానాలు అందుబాటులోకి తీసుకొచ్చి పేద ప్రజలకు వైద్యం అందేలా చర్యలు చేపట్టాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు.పల్లె దవాఖానాలు అందుబాటులోకి వస్తే గ్రామాల్లోని నిరుపేదలకు ఎంతో ఉపయోగకరం అవుతుందనీ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.




