28 March, 2026 | 4:57 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

ప్రభుత్వ వైద్యురాలు ప్రైవేట్ లో సేవలు.. వైద్యురాలిపై అధికారుల విచారణ

28-03-2026 03:18 PM

వైద్యశాల విషయాలు బయటకి పొక్కడంపై సిబ్బందిపై అగ్రహం వ్యక్తం

షాద్‌నగర్,(విజయక్రాంతి), ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తూ ప్రైవేట్ వైద్యశాలలో పనిచేస్తుందని ఒక డాక్టర్ పై వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు శనివారం నాడు విచారణని జరిపారు. జిల్లా  వైద్య ఆరోగ్యశాఖ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ షఫీ తో కూడిన అధికారుల బృందం షాద్నగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో విచారణ నిర్వహించారు.

ఈ విచారణ సందర్భంగా వైద్యశాలలో పని చేస్తున్న సిబ్బందిని స్థానిక స్థానిక వైద్యశాలలో పని చేస్తున్న డాక్టర్లను కూడా అధికారుల బృందం విచారించింది. వైద్యశాలలో జరుగుతున్న ప్రతి విషయం బయటకి ఎలా పొక్కుతోందని సిబ్బందిపై విచారణ అధికారులు చేసినట్లు తెలిసింది. వైద్యశాలలో అటెండెన్స్ అటెండెన్స్ రిజిస్టర్ విషయం కూడా ఎలా వెళ్లిందని ప్రశ్నించారు.  వైద్యశాలలో విచారణ విషయాన్ని స్థానిక అధికారులు గోపియంగా ఉంచారు విచారణ బృందం వచ్చిన విషయం కూడా బయటికి తెలియని ఇవ్వలేదు.