17 March, 2026 | 3:23 PM

బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్

17-03-2026 01:41 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని పల్లెబోగుడు తండా గ్రామ పంచాయతీ పరిధిలో గల టేకంచెరువు తండాలో నూతనంగా మంజూరైన బీటీ రోడ్డు పనులను పల్లెబోగుడు తండా గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో కోటి 59 లక్షల రూపాయలతో ఈ బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్లు గ్రామ  సర్పంచ్ పార్వతి శంకర్ తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ పార్వతి శంకర్ మాట్లాడుతూ...టేకుమ్ చెరువు తండాకు రోడ్డు లేక తండావాస్తులు గత ఎన్నో ఏళ్ల నుండి నానా ఇబ్బందులకు గురయ్యారని ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో రోడ్డు పనులు కోసం కోటి 59 లక్షలు మంజూరు కావడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో తమ తిప్పలు తప్పుతాయని తెలిపారు.టేకం చెరువు తండా రోడ్డును దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించినందుకు తాండా ప్రజల తరఫున ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్,ఉప సర్పంచ్ వినోద్,తండా నాయకులు పాల్గొన్నారు.