9 May, 2026 | 9:18 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

హనుమాన్ జయంతి రోజున సెలవు దినంగా ప్రకటించాలి

17-03-2026 01:45 PM

అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో వినతి...

బాన్సువాడ,(విజయ క్రాంతి): హనుమాన్ జయంతి(Hanuman Jayanti ) పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని కోరుతూ మంగళవారం అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో అధికారిని వసంతకు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

అన్ని గ్రామాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ కలిసి జరుపుకునే అతిపెద్ద హిందువుల పండుగ హనుమాన్ జయంతి అని అలాంటి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో వసంత సానుకూలంగా స్పందిస్తూ వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష సేవా సమితి బాన్సువాడ విభాగం గురుస్వాములు అంబిలిపూర్ రాజు స్వామి,పాలకుర్తి దత్తు స్వామి, తేలి మహేష్ కుమార్ స్వామి, కల్లేటి వెంకటరమణ స్వామి, దాసరి సతీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.