గ్రామ యువత ఆలం రాహుల్ ని ఆదర్శంగా తీసుకోవాలి
బెజ్జూర్, జూన్ 2 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని కుంటల మానేపల్లి గ్రామానికి చెందిన ఆదివాసి బిడ్డ అగ్ని వీరు గా ఎంపికయ్యాడు. ఎంపిక అయిన ఆలం రాహుల్ ని గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బెజ్జూర్ ఆదివాసి సమాజం,మండల అధ్యక్షులు కోరేత తిరుపతి మాట్లాడుతూ దేశ సేవ కొరకు ఎంపికైన రాహుల్ ని ఆదర్శంగా తీసుకొని మండలంలో ప్రతి ఆదివాసి యువత ముందుకు రావాలని దాని కొరకు అన్ని రకాలుగా సిద్ధంగా కావాలని ఒక రాహుల్ మాత్రమే కాదు మండలం నుండి రాబోయే కాలంలో ఆదివాసి యువకుల అగ్ని వీర్ ఎంపిక కావాలని దేశ సేవలో ఆదివాసి యువత ముందుండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుంటల మానేపల్లి గ్రామ సర్పంచ్ నైతం స్నేహ విలాస్, గ్రామ పెద్దలు నేతం గంగారం, తలండి మధునయ్య,తలండి రాజారాం,సంతోష్,నందారం,ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తలండి లక్ష్మణ్ సభ్యులుసంతోష్ తలండి రాములు మౌల్కరు సుభాష్ నైతం హనుమంతు అంగన్వాడి టీచర్ ప్రియాంక, పంచాయతీ కార్యదర్శి మడవి హరి ప్రసాద్,గ్రామ యువకులు చాకటి అరుణ్, సుభాష్, సంపత్ నైతం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.






