2 June, 2026 | 1:11 PM

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్

02-06-2026 12:30 PM

బాన్సువాడ, జూన్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని ఆయన సూచించారు. ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులో జపం జరిగితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ వార్డు కౌన్సిలర్ ఖాలేక్, కో ఆప్షన్ సభ్యురాలు సుల్తానా గౌస్ పాషా, లబ్ధిదారులు,కాలనీవాసులు తదితరులు ఉన్నారు.