26 February, 2026 | 11:00 AM

నిధుల జమతో గ్రామాలకు ఊపిరి!

26-02-2026 12:20 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

* గతంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులిచ్చినా అధికారులు ఖర్చు చేయలేదు. నిధుల్లేవంటూ కబుర్లు చెప్పి కాలం వెల్లదీసిన అధికారులు నిధులున్నప్పుడు కూడా అదే సాకులు చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. 

రాష్ర్టంలో గ్రామ పంచాయతీ ఎ న్నికలు 20 నెలలకు పైగా వాయిదా పడుతూ వచ్చాయి. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు నిధులు రావాల్సి ఉన్నప్పటికీ, ఎన్నికల జాప్యం కారణంగా అవి నిలిచిపోయాయి. గ్రామ పం చాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వా తే పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లను విడుదల చేస్తామని కేంద్రం పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చింది. దీంతో చాలా గ్రామ పంచాయతీలు తీవ్రమై న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి వచ్చిం ది.

చిన్న చిన్న పనులు చేసేందుకు కూడా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక పాలనాధికారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్థిక సం ఘం నిధులు నిలిచిపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్ర భుత్వం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూ పింది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కనబెట్టి గతేడాది డిసెంబర్‌లో మూడు విడతల్లో ఎ న్నికలను పూర్తి చేసింది. ఆ తర్వాత వెంటనే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్ర మాణ స్వీకారాలను కూడా పూర్తి చేసేలా ఏ ర్పాట్లు చేసింది.

ప్రస్తుతం రాష్ర్టంలోని అన్ని గ్రామాల్లోనూ పాలకవర్గాలు కొలువుదీరా యి. దీంతో ఆర్థిక సంఘం నిధుల విడుదల కు లైన్ క్లియర్ అయింది. ఆర్థిక సంఘం నుంచి నిధులు జమవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడ్డంకులు తొలగిపోనున్నాయి. కొత్త సర్పంచులు కూ డా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఫోకస్ పెట్టే పనిలో పడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం తెలంగాణకు దాదాపు మూడువేల కోట్ల రూపాయాలు రావాల్సి ఉంది.

తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ. 259.36 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో విడతగా దాదాపు రూ.387 కోట్లను విడుదల చేసింది. కేంద్రం నుంచి ఇప్పటి వరకు మూడు విడతల్లో కలిపి రూ. 1,034.42 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. ఈ నిధులన్నీ నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లో చేరడంతో పాలకమండళ్లలో కొత్త శోభ సంతరించుకున్నట్లయింది.

 గాంధీజీ నినాదం..

స్వరాజ్యమంటే.. స్వయంపాలన, స్వ యంపోషకం అన్న మహాత్ముని నినాదం సమకాలీన గ్రామీణ భారతావనికి అవసరమైన సామాజిక, రాజకీయ మార్పులు తీసు కువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే హా మీలు ఉపకరించాయి. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముని కలలు సాకారం చేసేందుకు, దేశం పురోగాభివృద్ధి సాధిస్తుందని బలంగా నమ్మిన గాంధేయ భావనతో శాసన నిర్మాణంలో పాలుపంచుకునే ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉంటుందని నిరూపించారు.

గ్రామ స్వరాజ్యమంటే అన్ని పరి మితులు, నిర్బంధాల నుంచి వచ్చే స్వేచ్ఛ అ వసరం లేదు. అధికారం కొంతమంది వ్యక్తు ల చేతుల్లో బందీగా మారడం ద్వారా నిజమైన గ్రామ స్వరాజ్యం సిద్ధించదని బాపూజీ 1909లో రాసిన ‘ఇండియన్ హోమ్ రూల్’ అనే పుస్తకంలో క్లుప్తంగా వివరించారు. అధికార దుర్వినియోగం జరిగినప్పుడు దానిని ప్రతిఘటించే సామర్థ్యాన్ని సగటు భారతీయ పౌరుడు పొందినప్పుడే గ్రామ స్వరా జ్యం సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ విశ్వాసం.

ఒక్కమాటలో చెప్పాలంటే అధికారాన్ని నియంత్రించే విషయంలో ప్రజలను చైతన్యపరిచి, వారి సామర్థ్యాన్ని తెలుసుకునేలా చే యడమే బాపూజీ దృష్టిలో నిజమైన స్వరా జ్యం. అంతేకాదు భారతదేశ ఆత్మ గ్రామాలలో నివసిస్తోందనేది..మహాత్ముని నమ్మ కం. అందుకే ఆయన కలగన్న గ్రామ స్వరాజ్యంలో పల్లెలు స్వయంపాలన కలిగి ఉన్నాయి.

కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతో ఆర్థిక పరిపుష్టిని సాధించే విధంగా రెండు కళ్లలాగా పనిచేస్తుంటాయి. ఏడాదిన్నర గా కాలపరిమితి ముగిసిన పంచాయతీలు కేంద్రం విధించిన షరతులకు, అడ్డంకిగా మారిన అభివృద్ధికి ఎన్నికలే శరణ్యమని బలంగా నమ్మిన సీఎం రేవంత్ రాష్ట్రానికి బకాయిపడ్డ 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలకు పరోక్షంగా కారకులయ్యారు. 

ఈ వ్యవస్థ..

మహాత్మా గాంధీ ఆశయమైన గ్రామ స్వ రాజ్య సాధనలో గ్రామ పంచాయతీల వ్యవ స్థ ఒక విప్లవాత్మక అడుగుగా భావించబడిం ది. బహుళ శాఖల పరిపాలనను ప్రజల ఇం టి వద్దకే తీసుకురావడం, సంక్షేమ పథకాల పంపిణీలో పారదర్శకత, అవినీతి నిర్మూలన, స్థానిక ఉపాధి కల్పన, గ్రామ సభలు, పంచాయతీ రాజ్ సంస్థలకు పాలనను జ వాబుదారీగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రారంభంలో, ఈ వ్యవస్థ స్పష్టమైన ప్రయోజనాలను అందించింది.

12,728 గ్రామాల పాలకమండళ్లు ఏర్పాటయ్యాయి.ఇంతకా లం పాలక మండళ్లు లేక పెన్షన్ల దరఖాస్తుల కోసం ఇప్పుడు పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది, గ్రామీణ ప్రజలు తమ సమస్యల కోసం తరచూ తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్లు, ప్రజా వేదికను ఆశ్రయిస్తుండేవారు. ప్రత్యేక అధికారు లు ఉన్నప్పటికీ ఆర్థిక భారం అయ్యి, ఈ గ్రామ వ్యవస్థ ఒక ‘శ్వేతహస్తి’ (వైట్ ఎలిఫెంట్)గా మారింది.

గ్రామ పంచాయతీలు రాజ కీయ ఘర్షణగా కాకుండా, అర్థవంతమైన సంస్కరణలకు నాంది పలుకుతామని ప్రభు త్వం చేసిన విన్నపానికి సహకరించి ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటు హక్కు విని యోగించుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. గ్రామ పంచాయతీ తీసుకునే ప్రతిపా దనలను వ్యతిరేకించడంలో, ఆమోదించడంలో, విమర్శించడంలో నిరుపేదలు, మ హిళలు, రైతులు అణగారిన వర్గాలనే తారతమ్యం లేకుండా అందరికీ సమాన అవకా శాలు, గ్రామపంచాయతీల పనితీరును విశ్లేషించడంలోనూ సమాన అవకాశం దక్కుతుందనేది ప్రజల విశ్వాసం. ప్రధాని మోదీ స్వరాష్ర్టం గుజరాత్ పంచాయతీల్లో ఈ -గ్రామ్ వ్యవస్థను బలోపితం చేసి అగ్రస్థానంలో నిలిచింది.

నిధుల విడుదల..

2011 జనాభా లెక్కల ఆధారంగా ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తున్నది. మొ త్తం నిధుల్లో గ్రామా పంచాయతీలకు 85 శాతం, మండల పంచాయతీలకు 10 శాతం, జిల్లా పరిషత్‌లకు  5శాతం చొప్పున కేటాయించడం జరుగుతుంది. ఇందులో 60 శా తం నిధులు త్రాగునీరు, పారిశుద్యంకు వినియోగించుకోవడం పరిపాటి. అయితే వచ్చి న నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, కేం ద్రానికి పంపాలి. ఆయా గ్రామాల్లో వచ్చిన నిధులు ఖర్చు చేస్తే ఈ -గ్రామ్ స్వరాజ్ పోర్టల్‌లో ఆడిట్ పూర్తీ చేస్తే కానీ మిగతా నిధు లు రావు.

అన్‌టైడ్  నిధులకు నిర్దిష్టమైన షరతులు ఏమి లేవు, ఇందులో గ్రామ అవసరానికి తగ్గట్టుగా గ్రామ సభ తీర్మానంతో ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల నిర్వహణ, మౌలిక వసతుల రూపకల్పన, విద్యుత్ బిల్లులు, గ్రామ, పాఠశాల భవనాల మరమ్మతులు అంగన్‌వాడీలు, ఇతర 29 రకాల అభివృద్ధి పనులకు వాడుకోవడనికి గ్రామసభ అనుమతి తప్పనిసరి. 

గ్రామాభివృద్ధి..

గతంలో గ్రామాల్లో మౌలిక సదుపాయా ల కల్పనకు ప్రభుత్వం నిధులిచ్చినా అధికారులు ఖర్చు చేయలేదు. నిధుల్లేవంటూ కబుర్లు చెప్పి కాలం వెల్లదీసిన అధికారులు నిధులున్నప్పుడు కూడా అదే సాకులు చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులతో నిధుల ఉపయోగంపై  అన్ని జిల్లాల్లో కలెక్టర్ల స్థాయి అధికారులతో సమీక్షలు చేసి అవగాహన కల్పించాలి. గాంధీజీ మాటల్లో.. ‘పరిశ్రమలు చేసేది ఉత్పత్తి కా దు.. ప్రజలు చేసేదే ఉత్పత్తి’.

ఇతరత్రా అవసరాలకు మిగతా గ్రామాలతో పరస్పర సహకారం కలిగి ఉండే పల్లెలో గ్రామ స్వరా జ్యం భాసిల్లుతుందని గాంధీ విశ్వాసం. రే వంత్ ప్రభుత్వం చూపెడుతున్న చొరవతో గ్రామస్వరాజ్యం సాధన దిశగా ‘గంగదేవిపల్లి’ ‘బాకారం’లా  రూపాంతరం చెందే ప్ర తి పల్లె మరిన్ని గ్రామాలకు మార్గదర్శిగా నిలిచి, తద్వారా యావత్ భారతావనికే ఆద ర్శం అవుతుందనేది నిర్వివాదాంశం.

 వ్యాసకర్త సెల్: 9866255355