calender_icon.png 22 February, 2026 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల ప్రాణాలతో చెలగాటం..?

22-02-2026 03:20:04 PM

- యాక్సిడెంట్లపై రిపోర్టుల నమోదులేదు..

- తాజాగా శాంతిఖనిలో మరో సంఘటన ..

- కార్మికుడి వేలు తొలగించే ప్రమాదం

- కార్మికుల హక్కుల హరింపు 

- కార్మిక సంఘాల్లో మౌనం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): సింగరేణిలో బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలన్నంటే అధికారులకు బొత్తిగా ఖతర్ లేకుండా పోయింది. బొగ్గు ఉత్పత్తి పై ఉన్న ప్రేమ కార్మికులపై పూర్తిగా లేకుండా పోయింది. ఇందుకు తాజాగా మందమర్రి ఏరియా బెల్లంపల్లి శాంతిఖని గని లో రెండురోజుల క్రితం జరిగిన గని ప్రమాదం అడ్డంపడుతుంది. 37 లెవెల్ లో డెస్సింగ్ చేస్తున్న క్రమంలో సైడ్ఫాల్ అయింది. ఈ ఘటనలో అక్కడే ఉన్న  కోట మనికేశ్వర్ అనే బదిలీ కార్మికుడికి చేతి వేళ్లకు గాయమైంది.

ఈ విషయం అధికారులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన కార్మికుడినీ వెంటనే పైకి తీసుకోచ్చి ప్రమాద రిపోర్టు నమోదు చేసి వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాలి. కానీ అధికారులు ప్రమాదం జరిగిన స్థలంలోనే  కార్మికుడినీ గంటల తరబడి ఉంచారు. చేతి వేళ్లకు గాయమై తీవ్ర రక్తం స్రావం జరిగింది. గాయం నొప్పితో కార్మికుడి బాధ వర్ణనాతీతం. ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో సేపటికికానీ కార్మికుడినీ గని ఉపరితలానికి తీసుకువచ్చారు.

ఆస్పత్రికి పంపించకుండా అధికారులు ప్రమాద రిపోర్టు నమోదు చేయకుండా సదరు కార్మికుడినీ  బెదిరింపుల కు దిగారు. చివరికి  ప్రమాద రిపోర్టు రాయకుండా బయట వైద్యం చేయించుకోమని హుకుం జారీ చేశారు. రిపోర్టు విషయంలో గాయపడిన కార్మికుడి తండ్రి అధికారులతో గొడవచేశారు. అయినా అధికారులు ససేమిరా ఒప్పుకోలేదు. కార్మికుడికి మద్దతుగా మాట్లాడినా కార్మికులను సహిత బెదిరించి చివరికి అధికారులు తమ పంతం నెగ్గించకొన్నారు. ప్రమాద రిపోర్టు మాత్రం రాయకుండానే  కార్మికుడినీ ఆస్పత్రికి పంపించారు. 

వేలు కట్ చేసే పరిస్థితి..

గాయపడిన కార్మికుడు ప్రస్తుతం రామకృష్ణ పూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నాడు. గాయమైన వేలుకు ఇన్ఫెక్షన్ అయింది. వేలును కట్ చేసే పరిస్థితి ఉందనీ వైద్యులు అంటున్నారని తెలుస్తోంది. గని ప్రమాదంగా నమోదు అయితేనే, గని ప్రమాదంలో గాయపడిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించి పరిస్థితి ఉంటది. ప్రాణాలకే కాదు,  చేతివేళ్ళు కట్ అయిన పరిహారంతో పాటు సర్ఫేజ్ పని ఇవ్వాల్సి ఉంటది. ఇది ప్రమాదంలో నష్టపోయినా కార్మికులకు చట్టం కల్పించిన హక్కులు.

కాగా శాంతిఖనిలో కార్మికుడి విషయంలోఅధికారులు ఉద్దేశపూర్వకంగానే రిపోర్ట్ రాయకుండా గాయపడిన కార్మికుడినకి అన్యాయమే చేశారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాన్ని గని ప్రమాదంగా నమోదు చేయకపోవడం వల్ల  సదరు కార్మికుడికి నష్టపరిహారం దక్కకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రమాదంలో చేతి వేలిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. విధినిర్వహణలో కార్మికుడి త్యాగానికి విలువలేకుండా పోయింది. అధికారులు తమ ఉదోగభ్రత పేరుకోసం  కార్మికుల ప్రాణాలతో చెలగాటం  ఆడుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రమాదాలు జరిదితే అది అధికారులకు పర్యవేక్షణ వైఫల్యం కిందకి వస్తుంది. అంతేకాదు అందుకుపై అధికారుల చర్యలకు గురికావలసి ఉంటది. అందుకని ప్రమాదాలు జరిగితే రిపోర్టులు నమోదు చేయడం లేదని తెలుస్తుంది. వారి స్వార్థం కోసం కార్మికులకు తీరని నష్టం చేస్తున్నారని ఆరోపణలు సర్వత్రా వినిస్తున్నాయి.. అధికారుల ఉద్యోగ భద్రత కోసం కార్మికులను బలిపశువుల్ని చేస్తున్నారన్న  విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా అధికారులు వ్యవహరించడానికి కార్మిక సంఘాల పూర్తి మద్దతు లేకుండా పోదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకే వేళా అలాకాని పక్షంలో అధికారుల తీరుపై ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలి. ప్రమాదాలు జరిగి కార్మికులు నష్టపోతుంటే కూడా సంఘాల నేతలు ఎందుకు స్పందించడంలేదు.. అధికారులతో లాలూచీ లేకుంటే? అన్యాయాలను ఎందుకు ప్రశ్నించడంలేదు. సింగరేణిలో కార్మిక సంఘాలు ఇందుకేనా? కార్మిక హక్కులను తాకట్టి పెట్టీ కంపెనీ నుంచి ప్రయోజనాలు పొందడానికే ఇలా దిగజారిపోయారనే సవాలక్ష ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా రిపోర్టు నమోదు చేసి కార్మికుడికి న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

- ఆ ముగ్గురిదే హవా..

శాంతిఖనిలో ఆ ముగ్గురిదే ఇష్టారాజ్యం. వారిది ఆడిందే అట పాడిందే పాట.. నిత్యం కార్మికులను అష్టకష్టాలు పెడుతున్నారనీ ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. గని లో  సదరు అధికారులు ఏనాడు దిగిన పాపానా పోలేదు. భూగర్భ గనిలో ప్రతిరోజూ  దిగి రక్షణ ఇతర అంశాలను పరిశీలించాలి. ఇది వారి రోజువారీగా చేసే విధులు. కాగా ఆ అధికార్లు గనిలో దిగక ఆఫీసులోనే కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక…