‘కల్ట్’కు గుమ్మడికాయ కొట్టేశారు!
విశ్వక్ సేన్(Vishwak Sen's) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో(self-directed film) తెరకెక్కిస్తున్న సినిమా ‘కల్ట్’. తరుణ్ భాస్కర్ మాటలు రాస్తున్న ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తారక్ సినిమా బ్యానర్‌పై సందీప్ కాకరాల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఫిలిం సిటీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్‌లో వందలాది మోడల్స్‌తో -50 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. భారతీయ చలన చిత్రాల్లోనే మొట్టమొదటి స్లాశర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 30న విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం.