calender_icon.png 5 August, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి

05-08-2025 01:02:23 AM

  1. వేములవాడ రూరల్, బోయినపల్లి పోలీస్ స్టేషన్లను 

తనిఖీ చేసిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని 

రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 4 (విజయక్రాంతి)సోమవారం రోజున వేముల వాడ రూరల్ , బోయినపల్లి పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసి స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, కేటాయించిన కిట్ ఆర్టికల్స్,జనరల్ డైరీ,స్టేషన్ రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై క్షుణ్ణంగా రివ్యూ చేసి పలు సూచనలు చేసిన ఏఎస్పీ. ఈసందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్ ని అమలు చేస్తూ నిఘా పెంచాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.రాబోవు స్థానిక సంస్థలు ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సంసిద్దంగా ఉండాలన్నారు.

ధికారులు, సిబ్బంది తరచు గ్రామాలను సందర్శిస్తూ ప్రజలతోమంచి సస్సబంధలు కొనసాగించాలని, గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగిన వెంటనే తెలిసేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలన్నారు.ప్పోలీస్ స్టేషన్ల పరోధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ప్రతి నెలా సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలని ఆదేశించారు.

స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ప్రతి రోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.అనంతరం స్టేషన్ల ఆవరణలో అధికారులతో కలసి మొక్కలు నాటారు.వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు రాజా కుమార్, అంజయ్య, పోలీస్ సిబ్బంది ఉన్నారు.