05-08-2025 01:02:47 AM
మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి
ఘట్ కేసర్ ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
ఘట్ కేసర్, ఆగస్టు 4 : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేం దుకు వైద్యశాఖను మరింత బలోపేతం చేస్తుందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. సోమవారం ఘట్ కేసర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వంద మంది రోగులకు గడువు తేదీ చూసి జాగ్రత్తగా ఇచ్చి, అందులో ఒక్కరికి తేదీ చూడకుండా ఇస్తే వంద మంది రోగులకు చేసిన వైద్యం కనిపించకుండా పోతుందని, ఫార్మసి సిబ్బంది ఎప్పటికప్పుడు మెడిసిన్ విచారణ తేదీ చెక్ చేస్తూ, ఆన్‌లైన్‌లోనే కాకుండా మ్యానువల్‌గా రిజిష్టర్లను కూడా నిర్వహిస్తూ, అప్రమత్తంగా ఉంటూ పేషంట్లకు మందులు పంపిణీ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ఎఎన్ సి ఎన్ని కేసులు మిస్ అవుతున్నాయని, పరీక్షలకు రానివారిని ఏవిధంగా గుర్తిస్తున్నారని గైనకాలజిస్టు డాక్టరును అడిగి తెలుసుకున్నారు. ఎఎన్ సి పరీక్షలకు రానివారిని గుర్తించి ఆశావర్కర్లు, ఎఎంసిల ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని కలెక్టరు తెలిపారు. ల్యాబరేటరీని పరిశీలించి రోజుకు ఎన్ని పరీక్షలు చేస్తున్నారని, ఇక్కడ ఎన్ని పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ లేని పరీక్షలు ఎక్కడ చేయిస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ద్య సేవలు అందించడంలో ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఘట్ కేసర్ తహాసీల్దారు రజని, మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.