30-11-2024 06:42:06 PM
మందమర్రి (విజయక్రాంతి): చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివేక్ జన్మదినం సందర్భంగా శనివారం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొతుకు సుదర్శన్ ల ఆధ్వర్యంలో పట్టణంలోని సింగరేణి మనోవికాస్ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు మంద తిరుమల్ రెడ్డి, రాయబారపు కిరణ్ ఆధ్వర్యంలో పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని వివేక్ పేరిట ఆలయ అర్చకులచే అర్చనలు, ప్రత్యేక యాగం నిర్వహించారు.
మాజీ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ రాకం సంతోష్, దాసరి రాజ్ కుమార్, ఉప్పలంచి చంద్రకాంత్, రంజిత్ ల ఆధ్వర్యంలో పాలచెట్టు ఏరియాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సుమారు 80 మంది విద్యార్థులకు ప్లేట్స్, స్వీట్స్, చాక్లెట్ పంపిణీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో వివేక్ జన్మదినం పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు బండి సదానందం ఆధ్వర్యంలో కేకు కట్ చేసారు. ఈ సందర్బంగా పట్టణంలోని పరిశుద్ధ కార్మికులకు నిరుపేదలకు చలికాలం దృష్టిలో పెట్టుకొని దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.