ఇందూస్ టవర్స్‌లో నేడు వోడాఫోన్ వాటా విక్రయం
19-06-2024 12:05 AM
- రూ.9,000 కోట్ల లావాదేవీగా అంచనా
న్యూఢిల్లీ, జూన్ 18: మొబైల్ టవర్ ఆపరేటింగ్ కంపెనీ ఇందూస్ టవర్స్‌లో వోడాఫోన్ గ్రూప్‌నకు ఉన్న 21.5 శాతం వాటాలో 9.94 శాతం వాటాను బుధవారం స్టాక్ ఎక్సేంజీల్లో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందూస్ టవర్స్ షేరు మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో రూ.346.45 వద్ద ముగిసింది. రూ.308 ధర మధ్యలో వొడాఫోన్ తన వాటాను విక్రయిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇందూస్ లో వోడాఫోన్ గ్రూప్ సంస్థల వద్ద ఉన్న వాటా విలువ 2.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 19,000 కోట్లు) ఉం టుంది. 9.94 శాతం వాటా విక్రయం ద్వారా వొడాఫోన్‌కు 1.09 బిలియన్ డాలర్లు (రూ. 9,100 కోట్లు) సమకూరవచ్చని అంచనా. దేశంలో టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియాలో బ్రిటన్ దిగ్గజం వొడాఫోన్ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.






