15 June, 2026 | 1:09 AM

తూప్రాన్ ప్రైమరీ స్కూల్‌లో శ్రమదానం

15-06-2026 12:08 AM

తూప్రాన్, జూన్ 14: తూప్రాన్ మున్సిపల్ నాలుగో వార్డ్ పరిధిలోని పుట్టకోట ప్రై మరీ పాఠశాల పున: ప్రారంభం కాబోతున్న సందర్భంగా 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ రా థోడ్, 13వ కౌన్సిలర్ చెలిమెల రాములుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొని ప్రైమరీ స్కూల్లో పేరుకుపోయిన చెత్త చెదారంతొ లగించారు.

అంతేకాకుండా నీటితో పాఠశా ల గదులను బెంచీలను కడిగి శుభ్రపరిచారు. గత యాభై రోజులుగా మరుగున పడిన పా ఠశాలలను శ్రమదానం పేరిట శుభ్రం చేయ డం జరిగింది. ఇందులో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, యూత్ సభ్యులు కొట్టాముల ఉపేందర్, నాని వెం కట్, అరకల మల్లేష్, చెలిమెల సతీష్, ప్రశాంత్, దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.