calender_icon.png 6 February, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలను చూసి ఓటు వేయండి

06-02-2026 12:40:11 AM

మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఇంచార్జి భీమ్ భరత్ ప్రచారం

శంకర్ పల్లి, ఫిబ్రవరి 5: మున్సిపల్ ఎన్నికల పోరులో భాగంగా శంకర్ పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తుతోంది. చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పామేన భీమ్ భరత్ శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ, గల్లీ గల్లీలో ప్రజలతో మమేకమై ‘చేయి’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.

ప్రజల సమస్యలే ఎజెండాగా ప్రచారంలో భాగంగా నాయకులు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణాల సమగ్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్నికైన అభ్యర్థులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని,

వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను తాము తీసుకుంటామని ఓటర్లకు హామీ ఇచ్చారు.కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉదయ్ మోహన్ రెడ్డి, జాతీయ నాయకులు ఎస్. అనంత రెడ్డి, మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, బద్దం కృష్ణ రెడ్డి వంటి కీలక నేతల తో పాటు ము న్సిపల్ అభ్యర్థులు దండు రాజేశ్వర్, జూలకంటి పాండురంగారెడ్డి, బిసోల అశోక్ కుమార్ లు  పాల్గొన్నారు.