20 May, 2026 | 11:19 AM

ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి

21-04-2024 01:26 AM

l రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్

l ఎంజీబీఎస్‌లో ఎన్నికల ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన సీఈఓ

l మూడు రోజులు కొనసాగనున్న ప్రదర్శన

హైదరాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): ఓటు హక్కును అందరూ సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పిలుపునిచ్చారు. ఎవరైతే చక్కని పరిపాలన చేస్తారని భావిస్తారో ఆ అభ్యర్థికి ఓటు వేసి ప్రజాస్వా మ్యాన్ని గెలిపించాలని కోరారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రసార మం త్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎంజీబీఎస్ ప్రాంగణంలో ఓటర్లకు అవగాహన కోసం ఏర్పా టు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఐ ఓట్ ఫర్ ష్యూర్ సెల్ఫీ పాయింట్ లో ఫొటో దిగారు. మూడు రోజుల పాటు ఉండే ఈ ఎగ్జిబిషన్ ఓటర్లకు చక్కని అవగాహన కల్పిస్తుందని వికాస్ రాజ్ తెలిపారు. ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా ఓటర్లు తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చన్నారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఓటు హక్కు ప్రాధాన్యంపై మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని వికాస్ రాజ్ 

తెలిపారు. 

యువత ముందుకు రావాలి.. 

పోలింగ్ సందర్భంగా ఇచ్చే సెలవులను కొందరు ట్రిప్ కోసం వినియోగించుకుంటారని, అలా కాకుండా ఓటింగ్‌లో పాల్గొనాల ని సజ్జనార్ సూచించారు. ఆర్టీసీలో నిత్యం 55 లక్షల మంది ప్రయాణిస్తారని, ఒక్క ఎంజీబీఎస్ బస్టాండ్ ద్వారా రోజుకు లక్ష మంది తమ గమ్యస్థానాలకు వెళ్తారని అన్నా రు. ఓటింగ్ పెరిగేలా అందరూ కృషి చేయాలని కోరారు. యువత ముందుకు వచ్చి ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఆర్టీసీ ఈడీ పురుషోత్తం నాయక్, పీఐబీ అదనపు డీజీ శృతి పాటిల్ తదితరులున్నారు.