07-02-2026 12:00:00 AM
దేశాభివృద్ధిలో పట్టణ ఆధునికీకరణ కీలక పాత్ర పోషిస్తుంది. ప్ర పంచీకరణ నేపథ్యంలో పట్టణాల అభివృ ద్ధి విస్తరణ ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. ప్రపంచీకరణ విసురుతున్న పోటీని తట్టుకోవాలంటే పట్టణాలు సాంకేతికంగా అన్ని రంగాల్లో వృద్ధి చెందాల్సిన అవసరముంది. పట్టణాల అభివృద్ధి అనేది మెరుగైన మున్సిపాలిటీల పాలన విధానాలపైనే ఆధారపడి ఉంటుంది. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పురపాలక ఎన్నికలు క్షేత్రస్థాయి పాలనకు అసలైన పునా దులుగా నిలుస్తాయి. పట్టణ ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే తాగునీరు, పా రిశుధ్యం, రహదారులు, వీధి దీపాలతో పాటు పర్యావరణ పరిరక్షణ వంటి ప్రాథమిక సేవలన్నీ పురపాలక వ్యవస్థ ద్వారానే అమలవుతాయి.
అందుకే ఈ ఎన్నికల్లో పౌరులు చురుకైన భాగస్వామ్యం, ప్రజాస్వామ్యం అవసరం. పెరుగుతున్న పట్టణీక రణ నేపథ్యంలో, పారదర్శకమైన పురపాలక పాలన పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఐదేళ్లకోసారి పట్టణ పుర పాలికల ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తున్నది. తాజాగా పురపాలిక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో పట్టణ ఓ టర్లు తమ భవిష్యత్తును నిర్ణయించే నా యకులను ఎన్నుకునేందుకు ఓటు హక్కు ను వినియోగించుకోవాలి.
ఎందుకు ఓటేయాలి?
ముఖ్యంగా పట్టణ ఓటర్లు ప్రలోభాలకు లొంగవద్దు. నోటుకు ఓటు అమ్ముకోవద్ధు. ఎన్నికల సమయంలో ఇచ్చే నోట్ల కట్టలకు ఆశపడి రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును తాకట్టు పెట్టుకోవద్దు. నాయకుడు ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి గెలిచిన తర్వా త అంతకుమించి సంపాదించుకుంటాడు. ప్రజలకు సేవ చేయాలనే స్పృహ నేటి నాయకుల్లో పెద్దగా కనిపించడం లేదు. ఈరోజు మనం డబ్బు తీసుకుంటే రేపు ఎన్నికల తర్వాత మన వార్డుకు వచ్చే కౌన్సిలర్‌ను అభివృద్ధి విషయమై నిలదీసే అవ కాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది.
కనీస మౌలిక వసతులు, రోడ్లు, విద్య, ఆరోగ్యం సదుపాయాలు దూరమవుతాయి. ము ఖ్యంగా ప్రశ్నించే హక్కును కోల్పోతాము. నోటుకు ఓటు భవిష్యత్తుకు ముప్పుగా భావించాలి. ఓటర్లు ఎలాంటి ఒత్తిడికి, భయానికి లోనుకాకుండా నాయకుడి ఎం పిక విషయంలో హేతుబద్ధంగా వ్యవహరించాలి. ఇక మున్సిపల్ ఎన్నికల సంద ర్భంగా ఓటరు ముందు నిలిచే ప్రధాన ప్రశ్న ‘నేను ఎవరికి ఓటు వేస్తున్నాను?. అయితే ‘నేను ఎందుకు ఓటు వేస్తున్నాను అన్నదే కీలకం. ఓటు కేవలం ఒక నిర్ణయం కాదు.
అది ఒక ఆశ. పట్టణం అభివృద్ధి పథంలోకి మారాలంటే భావోద్వేగాలకు అతీతంగా ఓటర్లు ఆలోచన చేయడం అవసరం. వ్యక్తిగత పరిచయాలు, తాత్కాలిక హామీలు, ఎక్కువగా వినిపించే మాటలు ఇవన్నీ క్షణికమైనవి. కానీ, ఓటు ప్రభావం మాత్రం ఐదేండ్లు ఉంటుంది. మంచి ఫలితాలను ప్రజలు గ్రహించాలంటే, ముందు గా అభ్యర్థి పాత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలి. మున్సిపల్ ప్రతినిధి అంటే పెద్ద మాటలతో ప్రసంగించే వ్యక్తి మాత్రమే కాదు. పట్టణ సమస్యలను వినగలగడం, వాటికి పరిష్కార మార్గాలు అన్వేషించడం, ప్రజలతో నిరంతర సంబంధం ఉంచడం.. ఇవన్నీ అతని బాధ్యతలు. ఈ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయో గమనించడం ఓటర్ల బాధ్యతగా గుర్తించాలి.
అభ్యర్థిపై అవగాహన..
ఒక అభ్యర్థిని ఎన్నుకునేటపుడు సదరు అభ్యర్థి ఎంత సామాజిక సేవ చేశాడన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సామాజిక సేవా, పాలనా దక్షత, ప్రజా సంబంధాలు, నిబద్ధత, నీతి అభ్యర్థి ఎన్నికకు గీటురాయి కావాలి. ఓటర్లు మందుకు, విందుకు బానిసలై అవినీతి నాయకులను ఎన్నుకోకూడ దు. అసమర్థులను, అవినీతిపరులను మ నం వేసే ఓటు ద్వారా బహిష్కరించాల్సిన అవసరముంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో బాధ్యతలను నిర్వహించే సామ ర్థ్యం వున్న వారినే ఎన్నుకోవాలి. ముఖ్యం గా అభ్యర్థుల్లో చదువుకున్న వారు పట్టణాభివృద్ధికి మెరుగైన సలహాలు, సూచనలు ఇస్తారన్న విషయం ఓటర్లు అర్థం చేసుకుంటే బాగుంటుంది.
ఉచితాలకు స్వస్తి పలకాలి. పోటీ చేసే అభ్యర్థికి పట్టణ సా మాజిక, ఆర్థికం, చారిత్రక, సాంస్కృతిక అంశాలపై కనీస అవగాహన వుండాలి. అంతేకాదు వారికి వార్డు డివిజన్ సరిహద్దులు కూడా తెలిసివుండాలి. ప్రభుత్వ భూరక్షణ వినియోగం, పబ్లిక్ పార్కుల వినియోగం, వాటి విస్తరణ, కోల్డ్ స్టోరేజీ సౌక ర్యాలపై అవగాహన ఉండాలి. దీంతో పా టు ఉత్పత్తి, ఉత్పాదకతకు కారణమయ్యే చిన్న కుటీర పరిశ్రమల ఏర్పాటు, వాటి పెట్టుబడులకు అన్వయించాల్సిన మార్గా లు, పనితీరు, ఆదాయ సంపద సృష్టి, ప ర్యావరణ ప్రకృతి విపత్తు చట్టాలపై విష య పరిజ్ఞానం ఉందా లేదా అనేది ఓటర్లు నిర్ధారించుకోవాలి.
నిజాయితీ అవసరం..
మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. అభివృద్ధి అంటే ఏమిటన్న దానిపై ఓటర్లకు స్పష్టత ఉండాలి. అభివృద్ధి అనేది కేవలం భవనాలు, రహదారులు మాత్రమే కాదు. శుభ్రమైన వాతావరణం, సురక్షితమైన ప్రజాస్థలాలు, అందుబాటులో ఉం డే ప్రభుత్వ సేవలు కూడా అభివృద్ధిలో భాగమే. ఈ దృష్టితో ఆలోచించినప్పుడు మాత్రమే ఓటు విలువ తెలుస్తుంది. ఓట రు తీసుకోవాల్సిన మరో జాగ్రత్త.. పోలిం గ్ రోజు వరకు వినిపించే మాటలను తూ కం వేయడం. ప్రతి మాటను నమ్మడం కాదు, ప్రతి వాగ్దానాన్ని తిరస్కరించడం కూడా కాదు. సాధ్యాసాధ్యాలను గుర్తించి, వాస్తవానికి దగ్గరగా ఉన్న మాటలను గుర్తించడం ఓటరు పరిపక్వతకు నిదర్శ నం. ఈ పరిపక్వతే పట్టణ పాలనను స్థిరం గా ఉంచుతుంది.
మున్సి పల్ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ప్రజలు కేవలం ఓటు హక్కును వినియోగించటం కాదు, తమవంతు బాధ్యతను కూడా స్వీకరిస్తున్నారని తెలుసుకోవాలి. ఓటు వేసిన తరువాత మౌనంగా ఉండిపోవడం కాదు, ఎప్పటికప్పుడు ప్రశ్నించగలగడం, సూచనలు ఇవ్వ గలగడం కూడా ఓటరు పాత్రలో భాగమే. ప్రజల చైతన్యంతోనే ఎన్నికల ఫలితాలు అర్థవంతంగా మారుతాయి. ఈ ఎన్నికల సందర్భంలో పట్టణ ఓటరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. తన నిర్ణయం ఒంటరిది కాదు. అది సమష్టి నిర్ణయంలో భాగం. ప్రతి ఓటు కలిసి ఒక పట్టణ స్వరూపాన్ని మారుస్తుంది. ఆ స్వరూపం శుభ్రంగా, సక్రమంగా, మానవీయంగా ఉండాలంటే ప్రతి ఓటరు తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి.
వికాసానికి దారెప్పుడు?
రాజ్యాంగదత్తమైన అధికారం భారత రాజ్యాంగంలోని తొమ్మిదో భాగం, పన్నెండవ షెడ్యూల్‌లో పేర్కొన్న 18 విధులు.. నేరుగా ప్రజల ప్రాథమిక అవసరాలతో ముడిపడి ఉన్నాయి. స్థానిక స్వపరిపాలన అనేది కేవలం అధికార వికేంద్రీకరణ మా త్రమే కాదు, అది పౌరుడికి అప్పగించిన సామాజిక బాధ్యత. ప్రలోభాలకు లోనుకాకుండా, స్వేచ్ఛాయుతంగా, విచక్షణతో ఓ టు వేయడం ప్రతి పౌరుడి నైతిక కర్తవ్యం. కుల మతాలకు అతీతంగా అభివృద్ధినే ప్రమాణంగా తీసుకుని ఓటు వేయడమే పరిపక్వ ప్రజాస్వామ్య లక్షణం. పట్టణ భవిష్యత్తుకు బాట పురపాలక ఎన్నికలు కేవ లం తాత్కాలిక నినాదాల పోటీ కాదు. ఇవి మన నగరాల భవిష్యత్తును నిర్ణయించే కీలక మలుపులు.
వేలిపై పడే సిరా చుక్క బాధ్యతకు చిహ్నమైతే, ఆ వేలు ఎన్నుకున్న నాయకత్వమే పట్టణ వికాసానికి ప్రాణం. ఎన్నికలతో ప్రజాస్వామ్యం ముగియదు, అక్కడే బాధ్యతాయుత పాలన మొదలవుతుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హ క్కును వినియోగించుకోవలిసిన బాధ్యత ఓటర్లపై వుంది. ఓటర్లు అప్రమత్తంగా వుం డి అరులైన అభ్యర్థులను కౌన్సిలర్/కార్పొరేటర్‌గా ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షిం చాలి. అభ్యర్థుల హామీలను పరిశీలించి వారి పని తీరును పరిశీలించాలి. ఫిబ్రవరి 11న మీ ఓటు హక్కును చట్టబద్ధంగా, విచక్షణతో వినియోగించుకోవడమే నిజమైన పౌర ధర్మం. వివేకంతో ఓటు వేద్దాం.. వికాసానికి దారి చూపుదాం.
వ్యాసకర్త సెల్: 9440245771
నేదునూరి కనకయ్య