calender_icon.png 9 February, 2026 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట గెలిచి రచ్చ గెలిచిన యాదగిరి

07-02-2026 12:00:00 AM

నిజానికి రచ్చ యాదగిరి ‘యాదాద్రి నారసింహ శతకాన్ని’ ముక్తిని సాధించడం కోసమే రచించినట్లుగా కనిపిస్తున్నది!. యాదగిరి ఎన్నో గ్రంథాలకు ద్రవ్యదాతగా నిలిచాడు. డాక్టర్ ధర్మోజిరావు నా కవిత్వం మీద పరిశోధన చేసి, ‘పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం’ నుంచి డాక్టరేట్ పొందిన గ్రంథానికి అయిన ముద్రణా వ్యయాన్ని యాదగిరి భరించాడు.

నేను యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లిన ప్పుడల్లా, ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి, అతని యోగక్షేమాలు తెలుసుకునేవాణ్ణి. ఆ వ్యక్తి పేరు రచ్చ యాదగిరి. ఆర్.ఎమ్.పి వైద్యునిగా రచ్చ యాదగిరి సుప్రసిద్దుడు. యాద గిరిగుట్టలోని వారికందరికీ గుర్తుండే వై ద్యుడాయన. తన ఎనబై ఏళ్ల జీవితకాలంలో నలబై ఏళ్లు ప్రజలకు వైద్య సేవలం దించాడు. ఒక పదేళ్లుగా వైద్యవృత్తికి దూరంగా ఉండి, తన ఇంటి కింది భాగాన్ని ఇతరులు ఆస్పత్రిని నిర్వహించడానికి కేటాయించాడు కూడా. యాదగిరి గారి దాతృ త్వం చెప్పుకోదగినది. తాను వైద్యవృత్తి ద్వా రా సంపాదించిన ధనంతో యాదగిరిగుట్టకు మిక్కిలి సమీపంలో కొన్న 30 ఎక రాల భూ మిని స్వామి సేవకే అంకితం చేసిన మహనీయుడు. పద్మశాలి అన్నసత్ర నిర్మాణానికి స్థల సేకరణలో ముఖ్యపాత్ర వహించి, నేటి అందమైన భవనానికి  పు నాదిరాయిగా నిలబడ్డాడు రచ్చ యాదగిరి.

గుట్టలో వైద్యవృత్తి..

తొమ్మిదవ తరగతి వరకే చదువుకొన్న యాదగిరి గారు నల్గొండ జిల్లాలోని ‘ఆత్మకూరు’లో జన్మించి యాబై ఏళ్లకుపైగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలోనే నివాసమున్నాడు. యాదగిరి మంచి కష్టజీవి. చేతితో వడ్లగిర్నిని నడిపే పనిలో కొంతకాలం ఉన్నాడు. గుట్టకు వచ్చిన తర్వాతనే వైద్యవృత్తిని స్వీకరించాడు. ప్రతిరోజు గుట్టపైకి రెండు మూడు సార్లు మెట్ల దారిగుం డా నడిచివెళ్లి అర్చకులకు వైద్యం అందించేవాడు. విశేషించి గుట్ట మీద ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించిన ఘనత యాదగిరి గారిదే. అర్చకులకు, రక్షకభటులకు, విద్యార్థులకు, సామాన్యులకు ప్రత్యేకంగా వైద్య శిబిరాలను నడిపినాడు. తీరిక వేళల్లో స మీప గ్రామాలకు సైకిలు మీద వెళ్లి సా మాన్యులకు కూడా, వైద్యసేవలు అం దించేవా డు. ఆరోజుల్లో ఆయన కేవలం 50 పైసలు తీసుకొని ఇంజక్షన్‌ను ఇచ్చేవాడు. ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్లను పరామర్శించి, ఆరోగ్యం గురించి తెలుసుకునేవాడు.

అందుకే ఈనాటికి రచ్చ యాదగిరిని గుర్తుపెట్టుకున్నవారు చాలా మందే ఉన్నారు. నేను గుట్ట మీదకు వెళ్లి స్వామిని దర్శించుకున్నప్పుడల్లా యాదగరి నా వెంట వచ్చే వాడు లేదా తన చిన్న కుమారుడైన శ్రీనివాసును తోడుగా పంపించేవా డు. గుట్ట మీద స్వామి అర్చకులందరికీ యాదగిరి సుపరిచితుడు. ఆయన వల్ల నాకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్ర సంగించే మహత్తరమైన అవకాశం లభించింది. రచ్చ యాదగిరిది పవి త్రమైన జీవ నం. ఆయన వైదిక జీవనాన్ని అలవర్చుకున్నవాడు. పర్వదినాల్లో తమ ఇంటిలో తప్ప నిసరిగా తన పరివారంతో కలిసి యజ్ఞం చేసేవాడు. యజ్ఞ వైభవాన్ని ఘనంగా చాటేవాడు. వేదవాఙ్మయం ఎంత గొప్పదో సవి వరంగా చెప్పేవాడు. మంత్రం చదివి దాని అర్థం బోధించేవాడు. తన జీవితకాలంలో ఆయన ఇతరుల చేత 800 యజ్ఞయాగాలను జరిపించి ఉంటాడు!

గుండె ధైర్యం ఎక్కువే..

తర్వాతి కాలంలో వైద్యవృత్తిని చేపట్టిన యాదగిరి స్వయంగా బొంబాయికి వెళ్లి వైద్యుల సూచన మేరకు తన గుండెకు ‘బైపాస్ సర్జరీ’ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండుసార్లు సర్జరీ అయినప్పటికీ ఆ విషయాన్ని లెక్కచేయకుండా గుం డె ధైర్యంతో జీవించగలిగాడు. ముఖ్యంగా రచ్చ యాదగిరి అందరితో హృదయపూర్వకంగా వ్యవహరించేవాడు. కనుక ఆయ న గుండెకు ఏ అపాయం కలగలేదని భా వించవచ్చు. రచ్చ యాదగిరి రెండు శతకాలను రచించాడు. ఒకటి వేదవేద్య శతకం కాగా.. రెండోది శ్రీ యాదాద్రి నారసింహ శతకం. వేద సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకున్న యాదగిరి తన రెండు శతకాలకు నాచేత పీఠికలు రాయించుకున్నాడు. యా దగిరిగుట్టలో జరిగిన రెండు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలకు యాదగిరి నన్ను ఆహ్వానించడమే గాక నాచేత ప్రసంగాలు కూడా ఇప్పించాడు.

‘పరుల కొరకెప్డు వృక్షముల్‌ఫలములిచ్చు

పరుల కొరకును నదులన్నీ పారుచుండ 

పరుల కోసమై గోవులు పాలనిచ్చు 

విశ్వరక్షక! సర్వేశ! వేదావేద్య’ అంటూ కొనసాగింది ‘వేదవేద్య శతకం’.

ఇట్లే, ‘ఘనముగా చదువుటలెల్ల

కడుపు కొరకె సొమ్ములెన్ని యున్నను బంధనమ్ము కొరకె భక్తి నీయందు నిలుపుట ముక్తి కొరకె 

నన్ను కరుణించు యాదాద్రి నారసింహ’ 

విధిరాతను మార్చలేం..

నిజానికి రచ్చ యాదగిరి ‘యాదాద్రి నారసింహ శతకాన్ని’ ముక్తిని సాధించడం కోసమే రచించినట్లుగా కనిపిస్తున్నది!. యాదగిరి ఎన్నో గ్రంథాలకు ద్రవ్యదాతగా నిలిచాడు. డాక్టర్ ధర్మోజిరావు నా కవిత్వం మీద పరిశోధన చేసి, ‘పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం’ నుంచి డాక్టరేట్ పొం దిన గ్రంథానికి అయిన ముద్రణా వ్యయా న్ని యాదగిరి భరించాడు. నేను పతంజలి యోగ దర్శనానికి వేదానుకూలంగా వ్యా ఖ్యానం చేసి, గ్రంథరూపం ఇచ్చిన సందర్భంలో, యాదగిరి తన దాతృత్వాన్ని చూపించాడు. తన ఇంటిలో ఎంతో వైదిక సా హిత్యం ఉంది. ఆయన తన ధర్మపత్ని లక్ష్మీబాయిని విద్యావంతురాలిని చేసి, ఆమె చేత కూడా ఎన్నో కీర్తనలను రచింపజేశాడు.

‘మహిళా భజన మండలి’కి తాను సారథ్యం వహించి, ఎక్కడ భజన కార్యక్ర మం జరిగినా అక్కడికి వెళ్లేవాడు. ఆధ్మాత్మికంగా తన పరివారాన్ని తీర్చిదిద్దిన రచ్చ యాదగిరిని చూసినప్పుడు ‘ఆయన ఇంట గెలిచి రచ్చన గెలిచాడు’ అని నాకు అనిపిస్తుంటుంది. రచ్చ యాదగిరికి నా మీద, నా కుటుంబసభ్యుల మీద ప్రేమ కలగడానికి ఒక బలమైన కారణం ఉంది. నా అ ర్థాంగి ప్రమీల రచ్చ వంశం నుంచి వచ్చిం ది. పవిత్ర జీవనులైన యాదగిరితో నాకు పరిచయం కలగకముందే ఆమె కన్నుమూయడం విధిరాత అనుకుంటాను. 

వ్యాసకర్త సెల్ : 9885654381

ఆచార్య మసన చెన్నప్ప