6 May, 2026 | 9:20 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

కొత్తపేట పండ్ల మార్కెట్‌లో తనిఖీలు

27-04-2024 01:04 AM

ఎల్బీనగర్, ఏప్రిల్ 26 : కొత్తపేట పండ్ల మార్కెట్‌లో టాస్క్‌పోర్స్ బృందం తనిఖీ చేపట్టింది. కొందరు వ్యాపారులు నిషేధిత రసా యనాలను వినియోగిస్తూ మామిడి పండ్ల ను కృత్రిమంగా పక్వానికి తెస్తున్నారు. ప్రభు త్వం సూచించిన పద్ధతులతోనే పండ్లను మగ్గించాలని సూచించారు. నిషేధిత రసాయనాలను వినియోగించి, ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడోద్దని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలను పాటించాలని సూచించారు. రసాయనాలతో మగ్గించిన సుమారు 550కిలోల మామిడి పండ్లను టాస్క్‌ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు మార్గదర్శకాలను పాటించకుంటే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మార్కెట్‌లో జరుగుతున్న అక్రమాలపై జీహెచ్‌ఎంసీ వాట్సాప్ నంబర్ 9100105795కి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించారు.