గడువులోగా ఓటరు ఫారాలు సమర్పించాలి
ప్రకటన విడుదల చేసిన చేవెళ్ల ఆర్డీఓ పార్థసారథి
చేవెళ్ళ /మొయినాబాద్, జూలై 15: 53-చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్ -202 6) కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహి స్తున్నట్లు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఏర్‌ఓ) తెలిపారు. ప్రతి ఓటరికి బీ ఎల్‌ఓల ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు పం పిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఓటర్లు తమకు అందిన ఎన్యుమరేషన్ ఫారాలను నింపి అ వసరమైన పత్రాలను జతచేసి జూలై 24లో గా సంబంధిత బీఎల్‌ఓకు లేదా బీఎల్‌ఓ యాప్ ద్వారా తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.
కుటుంబంలోని ఉన్న అన్ని ఓటర్ల ఫారాలను కుటుంబ సభ్యులు ఎ వరైనా ఒకేసారి సమర్పించే అవకాశం ఉంద న్నారు. ప్రస్తుతం చేవెళ్ల నియోజకవర్గంలో 65.30 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు మాత్రమే అందినట్లు అధికారులు వెల్లడిం చారు. మిగత ఓటర్లు గడువులోపు తమ ఫారాలు సమర్పించి సర్ జాబితాతో ఓటు హక్కును పరిరక్షించుకోవాలని కోరారు.
అలాగే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రతి ఓటరు గడువులోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేలా సహకరించాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు. సందేహాల నివృత్తి కోసం సంబంధిత మండలాలు, మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లను సంప్రదించాలని సూచించారు.






