16 July, 2026 | 12:45 AM

శివపురి కాలనీలో ఉచిత వైద్యశిబిరం

16-07-2026 12:00 AM

మణికొండ, జూలై 15 (విజయ క్రాంతి): శివపురి కాలనీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం  నిర్వహించారు. కాలనీ ప్రెసిడెంట్ ఓర్సు మధు, ఆవాస్ హాస్పిటల్ డాక్టర్ నరేందర్ నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది.

వైద్య శిబిరంలో భాగంగా కాలనీ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా కాలనీ వా సులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నిర్వా హకులు పేర్కొన్నారు. కాలనీ ప్రజలకు నా ణ్యమైన వైద్య సేవలు అందించిన ఆవాస్ హాస్పిటల్ బృందానికి కాలనీ కమిటీ సభ్యు లు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.