27 July, 2026 | 2:38 AM

జూలై 24లోపు ఓటు నమోదు చేసుకోవాలి

27-07-2026 02:02 AM
  1. మియాపూర్‌లో ఓటరు జాబితా సవరణ పనుల పరిశీలన
  2. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ పిలుపు

శేరిలింగంపల్లి, జూలై 26 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీలో జరుగుతున్న పనులను ప్రభుత్వ లెక్కల కమిటీ అధ్యక్షుడు ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తున ప్రతి ఒక్కరూ జూలై 24లోపు ఎన్యుమరేషన్ పత్రం పూర్తి చేసి బూత్ స్థాయి అధికారులకు అందజేసి ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు పారదర్శకంగా, వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో బూత్ స్థాయి అధికారులకు సహకారం అందించాలని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కాలనీ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఫారం సమర్పించిన తర్వాత తప్పనిసరిగా రసీదు తీసుకుని భద్రపరుచుకోవాలని సూచించారు.

కలెక్టర్, జోనల్ కమిషనర్లు ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తూ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.