27 July, 2026 | 3:03 AM

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

27-07-2026 02:01 AM

బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు వీజీఆర్ నారగోని

ముషీరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బిసి ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు విజిఆర్ నారగోని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో వీజీఆర్ నారగోని మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు గడిచినా బీసీలకు రాజ్యాధికారం, విద్య, సంపదలో తగిన భాగస్వామ్యం లభించలేదని విమర్శించారు.

బీసీ యువత రాజకీయ మార్పు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించడం, బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా, జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపు వంటి తీర్మానాలను ఆమోదించారు.

అనంతరం బీసీ ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా రాపోతు రాజు యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా నామని భాస్కర్, మహిళా అధ్యక్షురాలిగా నవిత, ప్రధాన కార్యదర్శిగా పరమేశ్వరి గౌడ్,  మహిళా ఉపాధ్యాయురాలుగా మీనాక్షి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సెల్వరాజ్, బిక్షపతి,  చంద్రయ్య,  సత్యనారాయణ,  పూసాల సంపత్ కుమార్, రాష్ట్ర కార్యదర్శిలు గా మల్లికార్జున్, కృష్ణ,  సాయికుమార్ తో పాటు పలువురు నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులను వీజీఆర్ నారగోని ప్రకటించారు.